బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ధర్నా

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

శ్రీకాకుళం అర్బన్‌: బకాయి పడ్డ డీఏను తక్షణమే చెల్లించాలని కోరుతూ దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళంలోని సంచార్‌ భవన్‌ వద్ద బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ జనవరి నుంచి 3 విడతల డీఏ అరియర్స్‌ను తక్షణమే చెల్లించాలన్నారు. దీనిపై కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా పక్కన పెట్టేయడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పోలాకి వెంకటరావు, మాతల గోవర్ధన్‌రావు, ఎస్‌.అభిమన్యు, బీహెచ్‌.లక్ష్మి, సూర్యనారాయణ, హెచ్‌. లక్ష్మి, వై.లక్ష్మి, వి.శివనాయుడు, జి.మహేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement