టెక్కలి: విద్యార్థులు ప్రణాళికంగా ఆలోచనలు చేస్తే తప్పనిసరిగా విజయాలు సాధిస్తారని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు వెల్లడించారు. కళాశాలలో సోమవారం 2026 ప్రతిభా పురస్కార వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రముఖ సంస్థలు నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో రూ.33 లక్షల అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీతో పాటు రూ.4 లక్షల కనిష్ట వేతన సరాసరి ప్యాకేజీతో 70 కంపెనీల్లో 800 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. వీరందరికీ అభినందన పత్రాలు అందజేసి సత్కరించారు. గేట్–2025 పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్, డెలాయిట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్–టీ మైండ్‌ట్రీ, విప్రో వంటి సంస్థలతో పాటు కోర్ రంగంలో
ఎన్‌సీసీ, రామ్‌కో, తోషిబా, పెన్నార్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు సాధించినట్లు వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ప్లేస్‌మెంట్ డీన్ ఎం.సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


