శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని 80 అడుగుల రోడ్డులో నారాయణ కళాశాలలో అకాడమీ ముద్రిత పుస్తకాలు అడ్డగోలకు తీసుకురావడమే కాకుండా అధిక ధరలకు విక్రయిన్నారన్న ఆరోపణలపై ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్‌కుమార్ నేతృత్వంలో విద్యార్థి సంఘ ప్రతినిధులు కళాశాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో తమను కళాశాల ప్రతినిధులు బయటకు నెట్టేశారంటూ ఏబీవీపీ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం ఏబీవీపీ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యాసంస్థ అక్రమాలు, దోపీడీలను ప్రశ్నిస్తునే ఉంటామన్నారు. జిల్లా ఆర్‌ఐఓ సురేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడంలేదని ఆరోపించారు. నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమపై కావాలనే విద్యార్థి సంఘ ప్రతినిధులు ఆరోపిస్తున్నారని, ఫర్నిచర్ ధ్వంశం చేశారని చెప్పారు.


