కమిటీలన్నీ వంద శాతం పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

కమిటీలన్నీ వంద శాతం పూర్తి చేయండి

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

● ఓటర్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలి

● వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలకు ముఖ్య నాయకుల సూచన

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీని పటిష్టం చేసుకునేందుకు సమష్టిగా కృషి చేద్దామని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, పార్లమెంటరీ పరిశీలకులు కుంభా రవిబాబు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, ముఖ్య నాయకులతో సోమవా రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియో జక వర్గాల్లో బూత్‌ కమిటీలు, గ్రామస్థాయి, మండల స్థాయి కమిటీలన్నీ పూర్తిచేసేందుకు సమన్వయకర్తలు కృషి చేయాలన్నారు. బూత్‌ స్థాయి నుంచి గ్రామస్థాయిలో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఒక్క ఓటును అధికార పార్టీ నాయకులు తొలగించకుండా కాపాడుకోవాల్సిన బాధ్య త మనపై ఉందన్నారు. అధికారాన్ని వినియోగించుకుని ఓట్లను తొలగించే కార్యక్రమం కూటమి నేతలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని సూచించారు. పార్టీకి సంబంధించి ఎక్కడ ఏ సమస్య ఉ న్నా తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా మనమంతా కలసి పనిచేయాలన్నారు.

కూటమి నేతలు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలుచేయకుండా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇసుక, మట్టి, నీరు అన్ని ప్రకృతి వనరులు దోచు కుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ, పార్టీ పాతపట్నం నియోజకవర్గం పరిశీలకులు పాలవలస విక్రాంత్‌, పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌, ఆమదావలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కోఆర్డినేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మహిళావిభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ, నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, దుంపల లక్ష్మణరావు, పిన్నింటి సాయి, కరిమి రాజేశ్వరరావు, చల్ల రవికుమార్‌, వెలమలకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, గొండు రఘురాం, సనపల నారాయణరావు, గేదెల పురుషోత్తం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement