● జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సిక్కోలు జోరు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాల్లో పూర్తి హవా కనబర్చారు. ఆమదాలవలస సమీపంలోని పూజారిపేటకు చెందిన చింతాడ అజయ్‌కుమార్ 99.88 పర్సంటైల్ స్కోర్‌తో మెరిశాడు. తల్లిదండ్రులు వెంకటరమణ, అమ్మాజీ. జిల్లాకు చెందిన నరవ రోషన్ రామ్ 99.63 పర్సంటైల్‌తో రాణించాడు. తండ్రి మహేశ్వరరావు, తల్లి అరుణకుమారి. శ్రీకాకుళానికి చెందిన కంచరాపు రేవంత్‌కుమార్ 99.36 పర్సంటైల్‌తో ప్రతిభ కనబర్చాడు. తండ్రి కంచరాపు జోగరావు, తల్లి పూర్ణచంద్రావతి. అలాగే శ్రీకాకుళానికే చెందిన బాన్న రాజేష్ 99.03 పర్సంటైల్‌తో ప్రతిభ చూపించాడు.
కంచిలి: కంచిలిలో నివసిస్తున్న గుడ్ల సాహితి 99.57 పర్సంటైల్ సాధించింది. ఈమెకు ఆల్ ఇండియా జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 610 ర్యాంకు వచ్చింది. ఈమె తండ్రి పైడి రాజు వ్యాపారం చేస్తుండగా, తల్లి శైలజ గృహిణి. ఇదే గ్రామానికి చెందిన బత్తుల వంశీకృష్ణ 99.715 పర్సంటైల్ సాధించాడు. ఇతను ఆల్ ఇండియాలో 4653వ ర్యాంకు సాధించాడు. ఇతని తండ్రి రమేష్, తల్లి గాయత్రిలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కంచిలిలో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థి కొత్తపల్లి ప్రశాంత్ 69.01 పర్సంటైల్ సాధించి, ఎస్సీ కేటగిరిలో ఆల్ ఇండియా 36663 ర్యాంకు సాధించాడు.


