నేడు తీవ్ర వడగాలులకు అవకాశం | - | Sakshi
Sakshi News home page

నేడు తీవ్ర వడగాలులకు అవకాశం

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

రాష్ట్రంలో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. మంగళవారం రాష్ట్రంలో 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 29 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం 54 మండలాల్లో తీవ్ర వడగాలులు, 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాకు సంబంధించి రెండు రోజుల పాటు తీవ్ర ఉక్కపోత, వడగాలులు ఉంటాయని తెలిపారు. జిల్లాలో ప్రధానంగా ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలకు దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

–శ్రీకాకుళం పాతబస్టాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement