ఉన్నదే ఒక్కగానొక్క బావి. ఆ ఊరిలో 300 మంది జనాభా ఉంటే అందరికీ ఆ బావి నీరే ఆధారం. ఇంత కీలకమైన బావి నీటిని ఓ నలుగురు వ్యక్తులు మోటార్లు పెట్టి తోడేస్తున్నారు. వేసవి కావడంతో ఊరుఊరంతా గగ్గోలుపెడుతోంది. సంతబొమ్మాళి మండలం నర్సాపురం పంచాయతీ పందిగుంట గ్రామం వ్యథ ఇది. బావిలో గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మోటార్లు పెట్టి రోజూ నీళ్లను నేరుగా వాళ్ల ఇళ్లకు పైపుల ద్వారా తోడేస్తుండడంతో మిగిలిన వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి కె.విద్య వద్ద ప్రస్తావించగా.. దీనిపై గ్రామస్తులు ఫిర్యాదు ఇచ్చారన్నారు. – సంతబొమ్మాళి


