ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలపై వడ్డీ మాఫీ | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలపై వడ్డీ మాఫీ

Apr 20 2026 9:41 AM | Updated on Apr 20 2026 9:41 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: షెడ్యూల్‌ కులాల కార్పొరేషన్‌ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 సంవత్సరం వరకు రుణాలు పొందిన ఎస్సీ లబ్ధిదారులకు వడ్డీ మాఫీ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార సంఘం ఇన్‌చార్జి కార్యనిర్వాహక సంచాలకులు వినాయకం ఒక ప్రకటనలో తెలిపా రు. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 సంవత్సరం వరకు ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేడీసీ కింద స్వయం ఉపాధి పథకాల లోన్లు పొందిన ఎస్సీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2018 –19 సంవత్సరం వరకు తీసుకున్న రుణాలపై ఈ నెల 30వ తేదీ లోగా అసలు మొత్తం చెల్లించిన లబ్ధిదారులకు వడ్డీ మొత్తం మాఫీ జరుగుతుందన్నారు. ఏప్రిల్‌ 30వ తేదీ తర్వాత వడ్డీ మాఫీ అవకాశం రద్దవుతుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత లబ్ధిదారులు అసలుతో పాటు వడ్డీని కూడా చెల్లించాలని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement