ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1975–76 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ఫంక్షన్ హాలులో 50 ఏళ్ల తర్వాత కలిసి ఆనాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన బులుసు పేరి శాస్త్రి మాస్టారును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జి.వి.నరసింహులు, ఎస్.చంద్రశేఖర్, జె.రామారావు, కుప్పిలి వెంకట రాజారావు, సరుబుజ్జిలి మాజీ ఎంపీపీ కిల్లి సత్యనారాయణ, అప్పలాచారి, కిల్లి రామ్మోహన్‌రావు, గవర్నమెంట్ హైస్కూల్ హెచ్‌ఎం కె.ఏ.రాములు, శివానందమూర్తి, బులుసు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
– ఆమదాలవలస


