నేడు మెగా జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు మెగా జాబ్‌మేళా

Apr 20 2026 9:41 AM | Updated on Apr 20 2026 9:41 AM

ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శ్రీశివానీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సముదాయంలో సోమవారం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. శివానీ విద్యా సంస్థలతో పాటు ఉన్నతి ఫౌండేషన్‌ సంయుక్తంగా ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. ఫాక్స్‌కాన్‌, అపోలో, టాటా ఎలక్ట్రానిక్స్‌, అరబిందో, కేఎల్‌ గ్రూప్‌ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, బీటెక్‌, బీఏ, బీకాం, బీఎస్సీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు ఉదయం 9 గంటలకు కళాశాల ప్రాంగణానికి చేరుకోవాలన్నారు.

జిల్లా రెవెన్యూ సర్వీసుల

సంఘం కార్యవర్గం ఎన్నిక

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడిగా బీవీవీఎన్‌ రాజు (డిప్యూటీ తహసీల్దారు) ఎన్నికయ్యారు. జిల్లా రెవెన్యూ సర్వీసు సంఘం ఎన్నికలు (2026 – 2029) ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా రాజు, సెక్రటరీగా డి.సోనికిరణ్‌, సహాధ్యక్షుడిగా ఎస్‌.గణపతిరావు, ఉపాధ్యక్షులుగా బి.సత్యం, బి.గోపాల్‌, కె.అరుణకుమార్‌, డి.పద్మావతి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా జి.కె.శ్రీనివాసరావు, స్పోర్టు అండ్‌ కల్చరల్‌ ప్రతినిధిగా ఐ.లింగరాజు, జాయింట్‌ సెక్రటరీలుగా ఎం.గౌరీశంకర్‌ కుమార్‌, బి.సంతోష్‌కుమార్‌, కె.రాధిక, ఎస్‌.ప్రకాశరావు, ట్రెజరర్‌గా మురళీధర్‌ నాయక్‌, కార్యవర్గ సభ్యులుగా కె.శరత్‌బాబు, సీహెచ్‌ దామోదరరావు ఎన్నికయ్యారు. వీరిని రెవెన్యూ ఉద్యోగులు అభినందించారు.

సమర్థవంతమైన నాయకత్వం అలవర్చుకోవాలి

రెవెన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : రెవెన్యూ సర్వీసుల సంఘంలో సమర్థవంతమైన నాయకత్వం ఉందని, మంచి నాయకత్వంతోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నగరంలోని రెవెన్యూ వసతి గృహంలో జిల్లా రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ఎన్నికలకు హాజరయ్యారు. పూర్వ అధ్యక్షుడు, ఇటీవల డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందిన కంచరాన శ్రీరాములును అసోసియేషన్‌ తరఫున ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షుడు పప్పల వేణుగోపాల్‌, కళ్యాణ చక్రవర్తి, కార్యదర్శి వీవీఎన్‌ రాజు, తహశీల్దార్‌ గణపతిరావు, మహిళా సభ్యురాలు ప్రవల్లిక ప్రియా, ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, మురళీధరనాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement