శ్రీకాకుళం న్యూకాలనీ: ఆరోగ్య పరిరక్షణలో హోమియో వైద్యం కీలకభూమిక పోషించనుందని ఐఐహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కేఎస్‌ఎస్ శివమూర్తి అన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ (ఐఐహెచ్‌పీ) ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ సహకారంతో శ్రీకాకుళం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో సైంటిఫిక్ సెమినార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమియోపతి వైద్యానికి దేశంతోపాటు విశ్వవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందన్నారు. ఐఐహెచ్‌పీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ నరేంద్రనాథ్, పూర్వపు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కేఆర్‌కెపీ మూర్తి, జాతీయ సంయుక్త కార్యదర్శి డాక్టర్ వీకే పంకజాక్షన్, డాక్టర్ పంచిరెడ్డి అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీబీకె సతీష్, మహరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ సైన్సెస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీఎస్ శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స పూర్తిచేయడంలో హోమియోపతి తిరుగులేని రారాజుగా విరాజిల్లుతోందన్నారు. అనంతరం పూణేకు చెందిన డాక్టర్ మనీషా సోలాంకి, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ బి.జ్ఞానానంద, విశాఖపట్నంకు చెందిన డాక్టర్ సజిత్ తెలగంశెట్టి, అమలాపురానికి చెందిన డాక్టర్ వీఎస్ దయానిధి వివిధ అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ కె.వివేకనంద, కన్వీనర్లు డాక్టర్ సువ్వారి రవికుమార్, డాక్టర్ ఎన్.దాసు, ఎ.వి.షణ్ముఖరాజు, డాక్టర్ రమణ, డాక్టర్లు, హోమియో వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.


