కాలేయమే కీలకం! | - | Sakshi
Sakshi News home page

కాలేయమే కీలకం!

Apr 19 2026 8:23 AM | Updated on Apr 19 2026 8:23 AM

అరసవల్లి: మానవ ఆరోగ్యంలో కాలేయం (లివర్‌) పాత్ర అత్యంత కీలకం. మనం బాగుండాలంటే లివర్‌ బాగుండాలని ప్రముఖ గాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీహర్ష పల్లె సూచించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగిన వ్యాయామం, మద్యానికి దూరంగా ఉండటంపై పలు సూచనలను చేశారు. ఆదివారం ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా లివర్‌ ఆరోగ్యంపై ప్రభావం చూపించే కారకాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘సాలిడ్‌ హేబి ట్స్‌– స్ట్రాంగ్‌ లివర్‌’ అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ లివర్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఇదే విధానాన్ని ప్రజల్లో మరింత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు.

ధూమపానం, మద్యపానం వద్దు..

కాలేయాన్ని ప్రభావితం చేసేలా ఫ్యాటీ లివర్‌, హెపటైటిస్‌ ఎ, బి,సి,ఇ, సిర్రోసిస్‌ తదితర వ్యా ధులుంటాయి. అధికంగా మద్యాన్ని సేవించిన, సిగరెట్లు తాగిన వారి లివర్‌ తక్కువ కాలంలోనే పాడయ్యే అవకాశముంది. కొందరు ఎలాంటి అలవాట్లు లేకపోయినప్పటికీ తగిన వ్యాయామం చేయకపోవడంతో పాటు జన్యుపరమైన కారణాలతో అధిక కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్‌ సమస్యలతో తీవ్ర అవస్థలు పడుతుంటారు. అలసట ఎక్కువగా ఉండడం, పచ్చకామెర్లు, వాంతులు, పొట్టనొప్పి, ఆకలి లేకపోవడం తదితర లక్షణాలుం

టే హెపటైటిస్‌–బి లక్షణాలుగా గుర్తించవచ్చు. సిర్రోసిస్‌ (లివర్‌ గట్టిపడి స్కార్‌ టిష్యూ ఏర్పడటం) వారిలో లివర్‌ క్యాన్సర్‌ ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఫ్యాటీ లివర్‌ ఉంటే పకోడిలు, బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, కూల్‌ డ్రింకులు, స్వీట్లు, కేక్‌లు, చిప్స్‌, మైదా, ఆల్కహాల్‌ తదితర వస్తువులు సేవించకూడదు. లివర్‌ను కాపాడుకునేందుకు కొబ్బరినీరు, తాజా పండ్లు, పైబర్‌ (పీచు) పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్కహాల్‌, సిగరెట్లకు దూరంగా ఉండాల్సిందే..

పెరుగుతున్న కేసులు..

జిల్లాలో ఇటీవల కాలంలో లివర్‌ డామేజ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. 2010 నుంచి జిల్లాలో కేసుల సంఖ్య నెలకు సగటున 10 వరకు కేసులు నమోదవుతున్నాయి. క్రమేణా 2014 నుంచి మద్యం అధికంగా అమ్ముడుకావడంతో పాటు కల్తీమద్యం కూడా అందుబాటులోకి వచ్చేయడంతో మందుబాబుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. జిల్లాలో మద్యం ఏరులా పారుతున్న క్రమంలో లివర్‌ కేసులు కూడా అంతే స్థాయిలో కనిపిస్తున్నాయి. కాలేయ సమస్యలతో ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్‌ సమస్యలున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 55 శాతం మందికి ఫ్యాటీ లివర్‌ కేసులున్నట్లుగా అంచనా. డయాబెటిక్‌ కేసులు పెరగడం కూడా ఇందుకు మరో కారణంగా చెబుతుంటారు. ప్రస్తుతం పది కేసుల్లో ఇద్దరికి లివర్‌ క్యాన్సర్‌ సోకుతున్నట్లుగా అంచనా.

కాలేయం(లివర్‌)పై జాగ్రత్తలు అవసరం

అధిక మద్యం సేవించడంతో తీవ్ర ప్రభావం

ఫ్యాటీ లివర్‌తో పెను ముప్పు

నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం

Advertisement
 
Advertisement
Advertisement