ఎచ్చెర్ల: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన నిర్వహిస్తున్న ఏపీ పాలిసెట్–2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని పాలిటెక్నిక్ ప్రవేశాల జిల్లా సహాయ కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర యాప్) 95523 0009 లోనూ, http:polycetap.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ హాల్‌టికెట్లు పొందవచ్చునని చెప్పా రు. హాల్‌టికెట్లు పొందని, డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఉన్నవారు ఈ నెల 20వ తేదీ నుంచి సమీపంలో ఉన్న సహాయ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు.
టెక్కలి రూరల్: స్థానిక కోదండరామ వీధిలో శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించా రు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్ తన సిబ్బంది తో కలసి ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కోదండరామ వీధిలో సుమారు 60 ఇళ్లు సోదా చేసారు. అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. అలానే వీధిలోని సుమారు 90 వాహనాల రికార్డులను పరిశీలించి సరైన పత్రాలు లేని 12 ద్విచక్రవాహనాలతో పాటు ఆటోను గుర్తించి వాటిని స్టేషన్‌కు తరలించారు. మాదక ద్రావ్యలు వాడటం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు.
ఇచ్చాపురం: మున్సిపల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్‌కి 53 వినతులు వచ్చాయి. ఈ గ్రీవెన్స్ ముఖ్యంగా మున్సిపాలిటీలో కొటేరు బంద–కోదండరామచెరువు మధ్య 212/2 సర్వేనంబర్‌లో 34.30 ఎకరాలుండగా ప్రస్తుతం సుమారుగా 10.52 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని ఈ ఆక్ర మణలను తొలగించాలని, మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూ పాలని, బాహుదానది పై కొత్తవంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, బెల్లుపడ వరదగట్టు నిర్మాణం చేపట్టాలని, నియోజకవర్గ ప్రజ ల ఆరోగ్యం దృష్ట్యా 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని, కవిటిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం చేపట్టాలని, మినీ స్టేడియం నిర్మించాలని వినతి పత్రాలు అందజేశారు.
ప్రభుత్వ బడుల్లోనే పిల్లల్ని చేర్పించండి
కంచిలి: బడి ఈడు పిల్లల్ని అన్ని సౌకర్యాలు, చక్కని విద్యాబోధన చేపడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. మండలంలోని మఠం సరియాపల్లి గ్రామ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు శనివారం నిర్వహించిన బడి పిలుస్తోంది ర్యాలీలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
హిరమండలం: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గంగరాపు సింహాచలం విమర్శించారు. ఎల్‌ఎన్‌పేట మండలం మోదుగువలస ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వేతనదారులతో శనివారం ఆయన మాట్లాడారు. వేతనదారులకు ఫేస్ రికగ్నేషన్ యాప్, రెండు పూటలా పని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పేదల కోసం రూపొదించిన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్ర భాగస్వామ్యాన్ని తగ్గించడం దారుణమన్నారు.


