శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని గుజరాతీపేట సమీప ఫాజుల్‌బేగ్ పేటలో నివసిస్తున్న టీడీపీ డివిజన్ ఇన్‌చార్జి సురకాశీ వెంకటరావు చిట్టీలు, వడ్డీ డబ్బుల పేరిట రూ. కోట్లలో మోసగించారని బాధి తులు శనివారం ఆందోళన నిర్వహించారు. సుమా రు 30 మంది బాధితులు ఫాజుల్‌బేగ్‌పేట దేవాంగు ల వీధి మర్రిచెట్టు వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. వెంకటరావు కాంట్రాక్టు పనులు చేసుకుంటూ తమ వద్ద చిట్టీల పాట పేరుతో డబ్బులు తీసుకుని ఆరునెలలుగా పరారైపోయాడరని, ఎక్కడ ఉన్నాడో తెలీదని బాధితులు వాపోయారు. బాధితుల్లో మాదిరెడ్డి కృష్ణకు మారి, జనా దివ్య, పొట్నూరు కల్పన, మావూరు రోజా, కిరిగి సంతోష్‌కుమార్, దారపు శ్రీనివాస్, తోటాడ ఈశ్వరమ్మ, గొంటిముక్కల శివప్రసాద్, మరికొందరున్నారు. రెండో పట్టణ పోలీసులను సంప్రదించగా బాధితులు తమను ఇంకా సంప్రదించలేదని, కేసు నమోదు చేయలేదన్నారు.


