‘బడి పిలుస్తోంది’లో ప్రజలను భాగస్వామ్యం చేయండి | - | Sakshi
Sakshi News home page

‘బడి పిలుస్తోంది’లో ప్రజలను భాగస్వామ్యం చేయండి

Apr 19 2026 8:23 AM | Updated on Apr 19 2026 8:23 AM

‘బడి పిలుస్తోంది’లో ప్రజలను భాగస్వామ్యం చేయండి

నరసన్నపేట: జిల్లా వ్యాప్తంగా బడి పిలుస్తోంది కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములుగా చేయా లని డీఈఓ ఎ.రవిబాబు, ఏపీసీ వేణుగోపాలరావు అన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా శనివారం మండలం సత్యవరం జిల్లా పరిషత్‌ ఉన్న త పాఠశాలకు డీఈఓ, ఏపీసీలు వచ్చారు. గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యా యులతో పాటు పాల్గొన్నారు. కొన్ని ఇళ్లను సందర్శించి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ 23వ తేదీ వరకూ రోజూ అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు జరగాలని సూచించారు. పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకోవాలని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement