మెళియాపుట్టిలో వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

మెళియాపుట్టిలో వినతుల స్వీకరణ

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌కు 9 అర్జీలు

మెళియాపుట్టి: మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్‌ స్వప్నిల్‌ జీపీఆర్‌ఎస్‌ గ్రీవెన్స్‌ ద్వారా శుక్రవారం సమస్యల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యాప్తంగా 164 మంది వారి సమస్యలను అర్జీల రూ పంలో అందించినట్లు ఆయన పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనపై వినతులు అందించినట్లు తెలిపారు. మండలకేంద్రంలో నూతన అంగన్‌వాడీ కేంద్రం నిర్మించాలని కోరారు. పీఓ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. అనంతరం నందవ కొత్తూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించారు. పెద్దమడి గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మెళియాపుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్యులు సమయ పాలన పాటించాలని అంటూనే మందుల నిల్వలు ఇతరాలు పరిశీలించారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆ దేశించారు. స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ గ్రీవెన్స్‌లో 9 దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన అర్జీల్లో వికలాంగ పింఛన్లు మంజూరు కోరు తూ 2 దరఖాస్తులు, బ్యాటరీ వెహికల్స్‌ మంజూరు చేయాలని కోరుతూ 2 దరఖాస్తులు, ఉపాధి కల్పించాలని కోరుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు 2 దరఖాస్తులు, సదరం సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీని మార్చాలని కోరుతూ 1 దరఖాస్తు, చేపల వ్యాపారం చేసుకోవడానికి దివ్యాంగులకు ఉపయోగపడే వెహికల్‌ మంజూరు చేయాలని కోరుతూ 1 దర ఖాస్తు, మానసిక వికలాంగుని వైద్యం, మందులు ఇప్పించాలని కోరుతూ 1 దరఖాస్తు వచ్చాయి. కొత్తదిబ్బల పాలెం గ్రామానికి చెందిన వికలాంగురాలు చేసుకొన్న దరఖాస్తును కలెక్టర్‌ పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని డీఆర్‌డీఏ పథక సంచాలకులు కిరణ్‌ కుమార్‌ను ఆదేశించారు. అలాగే మానసిక వికలాంగునికి వైద్యంతో పాటు ఉచిత మందులు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

‘భూములు ఇచ్చేదే లేదు’

వజ్రపుకొత్తూరు రూరల్‌: తాతల కాలం నుంచి ఉద్యాన పంటలను నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్న తాము అవసరమైతే ప్రాణాలను ఇస్తాం.. కానీ ఎట్టి పరిస్థితిలో భూములను ఇవ్వడానికి సిద్ధంగా లేమంటూ రైతులు తేల్చిచెప్పారు. మండలంలో గల మోట్టూరు గ్రామ సచివాలయంలో శుక్రవారం గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టుకు సంబంధించి స్థానిక తహసీల్దార్‌ డి.సీతారామయ్య ఆధ్వర్యంలో భూ సేకరణ కోసం గ్రా మస్తులతో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు రైతుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్‌ పోర్టు విషయంలో నాయకులకే ఒక స్పష్టత లేదని, ఒక రోజు కార్గో ఎయిర్‌ పోర్టు అంటున్నారు, మరో రోజు డొమెస్టిక్‌ ఎయిర్‌ పోర్టు అంటున్నారని విమర్శించారు. పాలకులకే స్పష్టత లేనప్పుడు పరిహారంపై ఎన్నో సందేహాలు ఉన్నాయని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఎయిర్‌ పోర్టు నిర్మాణం పూర్తయ్యే సమయానికి యువతకు ఉద్యోగ అర్హత వయస్సు దాటితే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉద్దానంలో ఉన్న లక్షలాది చెట్లను ధ్వంసం చేస్తే పర్యావరణానికి ముప్పు కలగదా అని ప్రశ్నించారు. జీడికి మద్దతు ధర ఇవ్వని వారు భూములు అడగడం విడ్డూరమన్నారు. సమావేశంలో పా తపట్నం, ఆమదాలవలస తహసీల్దార్లు ప్రసాదరావు, రాంబాబు, కాశీబుగ్గ రూరల్‌ సీఐ తిరుపతి, ఎస్‌ఐ బబి నీహర్‌, వీఆర్‌ఓలు ప్రసాద్‌, షణ్ముఖ, యర్రయ్య, తిరుపతి, శ్రావణ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement