శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

న్యూస్‌రీల్‌

భూ రికార్డుల్లో తప్పిదాలు సహించబోము: కలెక్టర్‌

శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

హిరమండలం: భూ రికార్డుల నమోదులో ఒక్క తప్పు జరిగినా సహించేది లేదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ హెచ్చరించారు. ఎల్‌ఎన్‌పేట మండలంలోని సిద్ధాంతంలో గురువారం ఆపరేష న్‌ వెరిఫికేషన్‌ చేపట్టారు. గ్రామంలో 405 ఖాతాలకు సంబంధించి స్థితిగతులను పరిశీలించా రు. గతంలో ఇదే గ్రామంలో 359 ఖాతాలకు సంబంధించి తప్పులు దొర్లాయి. దీంతో సరిచేసే పనిలో పడ్డారు. చనిపోయిన వారి పేరిట రికార్డు లు, మిగతా ఖాతాల్లో చిన్నచిన్న లోపాలను గుర్తించిన కలెక్టర్‌ వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సరిచేయాలని ఆదేశించారు. సిద్ధాంతం గ్రామంలో సరుబుజ్జిలి మండలం పర్వతాలపేట కు చెందిన అరసవల్లి సోమేశ్వరరావుకు భూమి ఉంది. దీంతో గ్రామం నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని పర్వతాలపేట వెళ్లారు. అక్కడ రైతుతో మాట్లాడారు. రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో ఆరా తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement