జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు
ఫిబ్రవరి నుంచి గణనీయంగా తగ్గుదల
రానున్న రెండు నెలల్లో మరింత
విపత్కర పరిస్థితి
100 రోజుల ప్రణాళిక..
●నరసన్నపేట మండలంలో ఈ ఏడాది ఫిబ్రవరి లో 5.79 మీటర్లపైన ఉన్న భూగర్భ జలాలు మా ర్చి నెలాఖరుకు 7.26 మీటర్లకు పడిపోయాయి.
●జలుమూరు మండలంలో ఫిబ్రవరిలో 1.83 మీటర్ల పైన ఉన్న భూగర్భ జలాలు మార్చి నెలాఖరుకు 3.40 మీటర్లకు పడిపోయాయి.
●రణస్థలం మండలంలో ఫిబ్రవరిలో 9.58 మీటర్ల పైన ఉన్న భూగర్భ జలాలు మార్చి నెలాఖరుకు 11.10 మీటర్లకు పడిపోయాయి.
●సారవకోట మండలంలో ఫిబ్రవరిలో 6.11 మీటర్ల పైన ఉన్న భూగర్భ జలాలు మార్చి నెలాఖరుకు 7.74 మీటర్లకు పడిపోయాయి.
గత ఏడాది మార్చిలో జిల్లాలో సగటున 7.59 మీటర్లు లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఈ ఏడాది మార్చిలో 7.77 లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. అంటే 0.18 మీటర్ల లోతులో జలాలు ఉన్నాయి. గతేడాది జిల్లాలో నామమాత్రపు
వర్షాభావ పరిస్థితులు వల్ల భూగర్భ జలాలు
కొంతమేర తగ్గాయని అధికారులు చెబుతున్నారు.
ఇచ్ఛాపురం రూరల్ :
జిల్లాలో భూగర్భ జలాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. వేసవి ఎండలు మండుతుండటంతో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవు తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సగటు భూగర్భ జలమట్టం 7.10 మీటర్లు పైన ఉండగా.. మార్చిలో భూగర్భ జలాలు 7.77 మీటర్ల లోతుకు పడిపోయా యి. అంటే 0.67 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గాయి. ప్రస్తుతం జిల్లాలో నరసన్నపేట,జలుమూ రు, సారవకోట,రణస్థలం మండలాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వచ్చే రెండు నెలల్లో జిల్లా అంతటా భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. గతేడాది మార్చి నెలాఖరుతో పోల్చితే ఈ ఏడాది మార్చి నెలాఖరు కు భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయి.
పొంచి ఉన్న ప్రమాదం..
జిల్లా వ్యాప్తంగా చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి కంటే మార్చి నెలలో భూగర్భ జాలల తగ్గుదల స్వల్పంగా నే కనిపిస్తున్నప్పటికీ పలు మండలాల్లో జలాలు భారీగా పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండ నుంది. జిల్లాలో 30 మండలాల్లో ఫిబ్రవరితో పోల్చి తే మార్చిలో దాదాపు అంతటా భూగర్భ జలాలు పడిపోయాయి. ఫిబ్రవరిలో సగటు భూగర్భ జల మట్టం 7.10 మీటర్లు ఉండగా, మార్చి నెలాఖరుకు సగటు భూగర్భ జల మట్టం 7.77 మీటర్లకు పడిపోయింది. మొత్తం 0.67 మీటర్లకు పడిపోయాయి. హిరమండలం, గార, కంచిలి, ఎచ్చెర్ల, పాతపట్నం, సోంపేట, టెక్కలి మండలాల్లో భూగర్భ జలాల తగ్గుదల కనిపిస్తోంది. ఆమదాలవలస, కవిటి, కోటబొమ్మాళి, మందస, శ్రీకాకుళం మండలాలు స్థిర పరిస్థితిలో ఉన్నప్పటికీ తగ్గుదల ట్రెండ్ కొనసాగితే ప్రమాదం తప్పదని జిల్లా భూగర్భ జల అధికారులు హెచ్చరిస్తున్నారు.
గతేడాదితో పోల్చితే..
గార, కంచిలి, కోటబొమ్మాళి, మందస, నందిగాం, పలాస, సంతబొమ్మాళి, పోలాకి, పొందూరు, సారవకోట, సోంపేట, టెక్కలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో గత ఏడాదితో పోల్చితే నీటి మట్టం కొంత మేర పెరిగిందని అధికారులు తెలిపారు.
భవిష్యత్తులో నీటి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రస్తు తం జిల్లాలో జల ధార, జల హారతి ప్రొగాం చేపడుతున్నాం. ఇందులో భాగంగా జలసంరక్షణ పనులు నిర్వహిస్తున్నాం. జిల్లా ప్రజలు రీచార్జ్ పద్ధతులను అవలంబించి నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇళ్ల సముదాయాల వద్ద ఇంకుడు గుంతలు, పంట పొలాల వద్ద చెక్‌డ్యామ్‌లు, పాంపాడ్‌లు నిర్మించుకోవాలి. ఏప్రిల్, మే నెలల్లో సహజంగానే వేసవి తీవ్రత కారణంగా భూగర్భ జలాలు పడిపోతాయి. – ఎన్.వి.కె.దుర్గాప్రసాద్,
జిల్లా భూగర్భజల శాఖాధికారి


