● పదవి లేకున్నా పెత్తనమే! | - | Sakshi
Sakshi News home page

● పదవి లేకున్నా పెత్తనమే!

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

● పదవి లేకున్నా పెత్తనమే!

కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్న వ్యక్తి ఏ అధికారో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తయిన తర్వాత టీడీపీ నాయకులే అధికారుల కుర్చీలో ఆశీనులై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామ సచివాలయంలో శుక్రవారం గ్రామసభ నిర్వహిస్తున్నట్లు దండోరా వేశారు. మరో అరగంటలో గ్రామ సభ మొదలవుతుందన్న సమయంలో కాబోయే సర్పంచ్‌గా ప్రచారం చేసుకుంటున్న స్థానిక టీడీపీ నాయకుడు నేరుగా అధికారుల కుర్చీలో కూర్చొని అధికార దర్పం చెలాయించాడు. ఈ దృశ్యాన్ని చూసిన పంచాయతీ కార్యదర్శితో పాటు సచివాలయ సిబ్బంది చేసేదేం లేక అక్కడి నుంచి వేరే గదిలోకి వెళ్లిపోయారు. – ఇచ్ఛాపురం రూరల్‌

Advertisement
 
Advertisement
Advertisement