కంచిలి: కంచిలి, సోంపేట మండలాలను ఆనుకొని ఉన్న ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో రెండు రాష్ట్రాల ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సిబ్బంది సంయుక్తంగా నాటుసారా తయారీ కేంద్రాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. బెల్లం ఊట, నాటుసారా ధ్వంసం చేశారు. డిప్యుటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు కుమార్, మురళీధర్, సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి.రమణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ సీఐ మధుకుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. గొంగాపూర్ రామచంద్రాపూర్ గ్రామ సరిహద్దులలో సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి సుమారు 5వేల లీటర్లు బెల్లం ఊట, 200 లీటర్లు సారా ధ్వంసం చేశారు. ఈ దాడులలో సోంపేట, పలాస, ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి టాస్క్‌ఫోర్స్ , ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, ఒడిశా పోలీసులు పాల్గొన్నారు.


