కోకో గింజలను ఆరబెట్టడానికి సోలార్ క్రాప్ డ్రైయర్ ఆధునిక, లాభదాయకమైన సాంకేతికత అని రణస్థలం ఉద్యానవన అధికారి ఏ.అమరేశ్వరి తెలిపారు. రణస్థలం మండలం నారువ గ్రామంలో జిల్లాలోనే మొదటిసారిగా నిర్మించిన సోలార్ క్రాప్ డ్రైయర్ యూనిట్‌ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యరశ్మిని ఉపయోగించి గింజల్లోని తేమను 5–7 శాతానికి తగ్గిస్తుందని, తద్వారా నాణ్యమైన చాక్లెట్ తయారికీ అవకాశం కలుగుతుందన్నారు. ధూళి నుంచి రక్షణతో పాటు వర్షాకాలంలో కోకో ఆరబెట్టుకోవచ్చునని వివరించారు.యూనిట్ ఖరీదు రూ.3,50 లక్షలు కాగా ప్రభుత్వ రాయితీ రూ.1.40 లక్షలు ఇస్తుందని తెలిపారు. – రణస్థలం


