కర్షకులకు కష్టకాలం
రైతన్న ఇంట కనిపించని సంక్రాంతి
సందడి
వరదలు, తుఫాన్లతో నష్టాలు
కొందరికే ప్రభుత్వ సాయం
సంక్షేమాల పంపిణీలోనూ అన్యాయం
వ్యవసాయం నష్టాల్లో ముంచింది
కొత్తూరు:
విత్తనాలకు పరుగులు పెట్టి, ఎరువులకు గంట ల తరబడి నిలబడి, తుఫాన్లకు తట్టుకుని, వరదల ను కాచుకుని పంట పండించిన రైతన్న ఇంట నిజంగా సంక్రాంతి సంతోషం కనిపిస్తోందా..? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఖరీఫ్ ఆరంభంలో విత్తనాల కోసం ఆపసోపాలు పడ్డారు. వర్షాలు మురిపించీ మురిపించీ ఏనాటికో కురవగా.. ప్రభు త్వం ఇవ్వాల్సిన ఎరువు పక్కదారి పట్టిపోవడంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి ఎరువు తెచ్చుకున్నారు. వాయుగుండాలు, మోంథా తుఫాన్లు ఎప్పటికప్పు డు దాడులు చేస్తే.. కొంత పంటను పోగొట్టుకుని, మిగిలిన పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నా రు. ఎట్టకేలకు పంట చేతికి వచ్చాక.. దళారికి, ధా న్యం కొనేవారికి అట్టే తేడా లేకపోవడంతో మద్దతు ధర కంటే తక్కువకే పంటనంతా విక్రయించేస్తున్నా రు. లెక్కకు మించి ట్రక్‌షీట్లు జనరేట్ చేయడం, లెక్కలకు అందకుండా మిల్లుల్లో ధాన్యపు రాశులు పోగు కావడం, అదనంగా ఇస్తేనే ధాన్యం తీసుకుంటానని బెదిరించడం.. అన్నీ కర్షకుడి కష్టాన్ని వెక్కింరించేవే.
కష్టాలు.. నష్టాలు
మోంథా కారణంగా కొత్తూరు, హిరమండలం, ఎల్ ఎన్‌పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, జలుమూ రు, గార, నరసన్నపేట, మండలాల్లో వంశధార నది పరివాహక ప్రాంతాల్లో మూడువేల ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బ తింది. ఇదే తుఫాన్ వల్ల ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, మందస, పలాస, లావే రు, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, గార మండలాలతో పాటు పలు మండలాల్లో వరి, మొక్క జొన్న తదితర పంటలకు నష్టం కలిగింది. ఇంత నష్టం జరిగినా పరిహారం అందరికీ అందలేదు. వరదలు, తుఫాన్ల కారణంగా దిగుబడి కూడా తగ్గిపోయింది. పత్తి రైతులదీ అదే పరిస్థితి. అంతకుముందు యూరి యా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. అన్నదాత సుఖీభవ కూడా అందరికీ పడలేదు.
భారీ వర్షాలతో పాటు మోంథా తుఫాన్ కారణంగా పత్తి కాయలు, పిందెలు కుళ్లిపోయి కిందకు రాలిపో యాయి. పత్తి చేనుకు ఉన్న పత్తి తడిసి పోవడంతో పాడైంది. దీంతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఎకరాకు కనీసం 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. అప్పుల్లో కూరుకు పోయాను.
– గేదెల బాలకృష్ణ, పత్తి రైతు,
కొత్తూరు
వంశధార వరదలకు వరి పంట పూర్తిగా మునిగిపో యింది. పూర్తిగా కుళ్లిపో యింది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నాను. కనీసం వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
– అగతమూడి నాగేశ్వరరావు,
వరద బాధిత రైతు, కుంటిభద్ర
వైఎస్ జగన్ పాలనలో ఎరువులు, విత్తనాలు సుల భంగా అందేవి. రైతులు సుభిక్షంగా ఉండేవారు. సాయం ఎప్పటికప్పుడు అందేది.
– అంపిలి బుచ్చిబాబు, రైతు, గూనభద్ర
ఈ ఏడాది వ్యవసాయం నష్టాల్లో ముంచింది. దీంతో సంక్రాంతి సందడి లేదు. వర్షాలకు వరి, పత్తి పంటలు నాశనమయ్యాయి. పంట పూర్తిస్థాయిలో చేతికి అందకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక సంక్రాంతి సందడి లేకుండాపోయింది.
– కుప్పలి భాస్కరరావు, రైతు, కొత్తూరు
కర్షకులకు కష్టకాలం
కర్షకులకు కష్టకాలం
కర్షకులకు కష్టకాలం
కర్షకులకు కష్టకాలం


