శారీగమలు
● చీరకు జై కొడుతున్న యువతులు ● వేగంగా ధరించగలిగే చీరలకు డిమాండ్ ● అత్యధికంగా అమ్ముడవుతున్నవి అవే
శ్రీకాకుళం కల్చరల్: పండక్కి చీర కట్టాలి.. కానీ ‘కట్టు’ క్షణాల్లో అయిపోవాలి. ఇదీ నేటి యువతుల అభిప్రాయం. వారి అభిరుచి మేరకు సరికొత్త చీరలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. నిన్నటి తరం వారంతా ఆరు గజాల చీరలను ఎంచక్కా ధరిస్తారు. కానీ కొత్తతరం వారితోనే చిక్కు. చీర కట్టు రాక, శారీతో రోజంతా ఉండలేక వెస్ట్రన్ దుస్తులతో గడిపేస్తున్నారు. ఎట్టకేలకు వారికి అనుగుణంగా, సులభంగా ఉండేలా చీరలు వచ్చేశాయి. వేగంగా క్షణాలమీద ధరించగలిగే చీరలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది మార్కెట్. యువతులకే కాదు చిన్న పిల్లలను సైతం ఈ చీరలు తెగ ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి కి ‘వన్ మినిట్ శారీస్’ పేరుతో అన్ని షాపుల వాళ్లూ తెగ అమ్ముతున్నారు. ఆన్‌లైన్‌లోనూ ఇవి ట్రెండవుతున్నాయి.
పండగల సమయంలో చీర కట్టుకోవడం బాగుంటుంది. ఒక్క నిమిషంలో కట్టుకునే చీరలు రావడంతో చీర కట్టుకోవడం మరింత సులభమైంది.
– సాయి నిహారిక, సాఫ్ట్‌వేర్, శ్రీకాకుళం
నాకు చీర కట్టుకోవడం అంటే ఇష్టం. అ యితే అంత పెద్ద చీర కట్టుకోవడం కష్టం. మార్కెట్‌లో వన్‌మినిట్ చీరలు రావడంతో మామూలు డ్రస్సులతో పాటు నేను కూడా ఈ చీర కొనిపించుకున్నా.
– వెన్నెల, శ్రీకాకుళం
వన్‌మినిట్ శారీతో యువతులు
ఆన్‌లైన్‌లో నాకు కావాల్సిన డిజైన్‌లతో ఆర్డర్ పెట్టుకుంటా. నాకు చీర అంటే ఇష్టం. కానీ ఎక్కువసేపు కట్టాల్సి వస్తోంది. అయితే ఈ వన్‌మినిట్ శారీ వల్ల చాలా సింపుల్‌గా వెంటేనే కట్టుకోవచ్చు.
– యశశ్విని, బీటెక్ విద్యార్థిని
శారీగమలు
శారీగమలు
శారీగమలు
శారీగమలు


