రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
● ముగ్గురు యువకులకు గాయాలు
మెళియాపుట్టి : మండల కేంద్రం మెళియాపుట్టిలో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మామిడిగుడ్డి గిరిజన గ్రామానికి చెందిన జన్ని ధర్మారావు, జన్ని శ్రీశాంత్ ఒక ద్విచక్ర వాహనంపై, జన్ని దిలీప్ మరో ద్విచక్ర వాహనంపై మెళియాపుట్టి వైపు వస్తుండగా విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో అతివేగంతో పక్కపక్కనే ఢీకొన్నారు. వెనుక కూర్చున్న ధర్మారావు గాల్లో ఎగిరిపడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించడంతో ధర్మారావును టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు.


