కొబ్బరి చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Jan 10 2026 9:40 AM | Updated on Jan 10 2026 9:40 AM

కొబ్బ

కొబ్బరి చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

పోలాకి: కోడూరు గ్రామానికి చెందిన టెంక సంజీవు(40) శుక్రవారం కొబ్బరిచెట్టు నుంచి జారిపడి మృతిచెందాడు. ఎప్పట్లాగే బొండాలు దించే క్రమంలో చెట్టు ఎక్కగా నడుముకు కట్టిన తాడు తెగిపోవటంతో సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. వెంటనే తోటి కూలీలు నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంజీవు భార్య ముత్యాలు ఫిర్యాదు మేరకు పోలాకి పోలీసులు కేసు నమోదు చేశారు.

కాశీబుగ్గ రైల్వే గేట్‌ను ఢీకొన్న వ్యాన్‌

వజ్రపుకొత్తూరు రూరల్‌ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే ఎల్‌సీ గేట్‌ను శుక్రవారం టాటామ్యాజిక్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. గేటు విరిగిపోవడంతో సుమారు గంట సేపు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గేట్‌ కీపర్‌ విషయాన్ని రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ కుమార్‌దాస్‌కు తెలియజేయడంతో రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తాత్కాలిక గేటు ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్‌ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో వాహనాల రాకపోకలు కొనసాగాయి. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ డ్రైవర్‌పై ఆర్పీఎఫ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని రైల్వే పోలీసుస్టేషన్‌కు తరలించారు.

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

వజ్రపుకొత్తూరు రూరల్‌: బెండి గ్రామానికి చెందిన దేవలింగం మహేష్‌ (27) కాశీబుగ్గలో ఉన్న రోటరీనగర్‌లో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బెండి గ్రామానికి చెందిన మహేష్‌ పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన జ్యోత్స్నతో ఏడాది క్రితం కులాంతర ప్రేమ వివాహం జరిగింది. అప్పటి నుంచి కాశీబుగ్గలోని రోటరీ నగర్‌లో నివాసం ఉంటూ ప్రైవేట్‌ పనులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. మహేష్‌కు తల్లిదండ్రులు కాంతమ్మ, సింహాచలం ఉన్నారు. ఏకై క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతితో బెండి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

కొబ్బరి చెట్టు నుంచి  జారిపడి వ్యక్తి మృతి 1
1/2

కొబ్బరి చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కొబ్బరి చెట్టు నుంచి  జారిపడి వ్యక్తి మృతి 2
2/2

కొబ్బరి చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement