కాంప్లెక్స్‌కు పోటెత్తిన ప్రయాణికులు
శ్రీకాకుళం అర్బన్: జిల్లాకేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ శుక్రవారం ప్రయాణికులు పోటెత్తారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాంప్లెక్స్‌కు చేరుకోవడంతో రద్దీమయంగా కనిపించింది. పండగ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు కాంప్లెక్స్‌కు చేరుకోవడంతో కాంప్లెక్స్ మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. ప్రయాణికుల రద్దీకి తగ్గ బస్సులు లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత బస్సులు రావడంతో రద్దీ తగ్గింది.


