కంటికి రెప్పలా.. కాపాడుకుందాం..!
నేడు కాన్వొకేషన్..
జిల్లా కేంద్రంలో వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే ఘనంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రీ మెచ్యూర్ బేబీల్లో ప్రాణం నిలబెట్టుకున్న 30 మంది వరకు పురిటి బిడ్డల తల్లులతో ప్రత్యేక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నాం. కాన్వోకేషన్ తరహాలో కార్యక్రమం నిర్వహించి ప్రీమెచ్యూర్ బేబీలకు జీవించే హక్కు వచ్చిందన్న సంకేతాన్ని చాటిచెబుతాం. – డాక్టర్ అన్వేష్ ఆమెటి,
నియోనాటోలజిస్టు, శ్రీకాకుళం
అరసవల్లి :
సాధారణంగా గర్భిణులు నవమాసాలు నిండగానే పండంటి బిడ్డకు జన్మనిస్తుంటారు. అయితే వివిధ కారణాలతో 37 వారాలకు ముందే గర్భం నుంచి బిడ్డ బయటకు వస్తున్న పరిస్థితులు నేడు చాలావరకు చోటుచేసుకుంటున్నాయి. ఇలా జన్మించిన ప్రీమెచ్యూర్ బేబీల ఆరోగ్య పరిస్థితులపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన ఉంటుంది. ఇంతవరకు అందుబాటులో పురిటి బిడ్డకు వైద్యం, శస్త్రచికిత్సలు అందించే అవకాశాలు లేకపపోవండతో బిడ్డ ప్రాణాలపై ఆశలు వదులుకునే ఘటనలు జిల్లాలో కోకొల్లలు. అసలు ఇలా ముందస్తుగా బయటకు వస్తున్న పురిటి బిడ్డల విషయంలో అవగాహన లోపం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ బిడ్డల మరణాల నియంత్రించే లక్ష్యంగా ఏటా నవంబర్ 17న వరల్డ్ ప్రీ మెచ్యూరిటీ డే గా ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌లు నిర్వహిస్తున్నాయి.
మరణాలు తగ్గుముఖం పట్టేలా..
ప్రతి 10 ప్రీమెచ్యూర్ బేబిల్లో ఒక బిడ్డ మాత్రమే జీవిస్తున్నట్లుగా తాజాగా ఓ సర్వే రిపోర్టు నివేదించింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా ఆందోళన వ్యక్తం చేస్తూనే అవగాహన పెంచాలనే లక్ష్యంగా ప్రత్యేకంగా నవంబర్ 17న ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రకటించింది. పురిటి బిడ్డల మరణాల సంఖ్యను తగ్గించేందుకు వీలుగా ప్రత్యేక శస్త్రచికిత్సలతో పాటు నాణ్యమైన వైద్యాన్ని అందించేలా అడుగులు వేసింది. తాజాగా జిల్లా కేంద్రంలో లిటిల్ మాస్టర్స్ పేరిట పురిటి బిడ్డల జీవించే హక్కు కోసం అలాగే ప్రత్యేక శస్త్ర చికిత్సల కోసం ఆసుపత్రిని అందుబాటులోకి వచ్చింది. సీ్త్రలు వారి ఆరోగ్య కరమైన సమస్యల కారణంగా ప్రీమెచ్యూర్ బేబీలను జన్మనిస్తారు. ఇలాంటి వారికి గర్భంలో ఉన్న వాతావరణాన్ని వార్డుల్లో కృత్రిమంగా సృష్టించి పురిటి బిడ్డకు పునర్జన్మనిచ్చేలా చర్యలు తీసుకుంటారు. తల్లులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తమ ప్రీ మెచ్యూర్ బేబీల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఎలాంటి అనారోగ్య కారకాలకు వినియోగించకుండా చూసుకోవాలి. అలాకాకుండా ఇళ్లల్లో ఆచారాల పేరిట ఉంచేస్తే కచ్చితంగా జీవించే ఆశలు తగ్గిపోతాయి.
నెలలు నిండకుండానే జన్మిస్తున్న బిడ్డలు
పలు అనారోగ్య సమస్యలతో ఇక్కట్లు
జిల్లాలో అందుబాటులోకి వైద్యం
నేడు ప్రీ మెచ్యూరిటీ డే సందర్భంగా కాన్వొకేషన్
కంటికి రెప్పలా.. కాపాడుకుందాం..!


