టీడీపీ వర్గీయుల దాష్టీకం
● కాపుగోదాయవలసలో రచ్చబండను అడ్డుకునే ప్రయత్నం
● వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి యత్నం
● పోలీసులకు ఫిర్యాదు
సంతబొమ్మాళి: తెలుగుదేశం రౌడీమూకలు రెచ్చిపోయాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపడుతున్న కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే.. పోలీసుల ముందస్తు అనుమతితో కాపుగోదా యవలస గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో సజావుగా జరుగుతుండగా ఒక్కసారిగా గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి రసాభాస సృష్టించారు. బండబూతులు తిడుతూ పరుష పదజాలంతో నా యకులను దూషించారు. ఇక్కడ సమావేశం పెట్టకూడదని, ప్రభుత్వాన్ని విమర్శించకూడదని, హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా రచ్చబండ ఫ్లెక్సీని చించివేసి రౌడీయిజం చూపించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఎంత ఓపికగా చెప్పినా వినకుండా బూతులు, పరుష పదజాలంతో రెచ్చిపోయారు. తిలక్, తదితర నాయకులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ టీడీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకొని నచ్చజెప్పినా వినకుండా మరింత రెచ్చిపోయారు. మంత్రి అచ్చెన్నాయుడు డైరెక్షన్‌లోనే టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదంటూ తిలక్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తే మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
అనంతరం దాడికి పాల్పడిన డీటీపీ నాయకులు, కార్యకర్తలపై సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో స్థాని క సర్పంచ్ అంగ లక్ష్మీ పిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు సైన భీష్మారావు, వా డరేవు పాలేసు, వాడరేవు తారకేశ్వరరావు, వాడరేవు మహాలక్ష్మీ, కుత్తుమ పూర్ణావతి, బచ్చల నాగేశ్వరరావు, బచ్చల దాదెమ్మ, సైన దానేసు, గేదెల గో విందరావు, సైన సింహాచలం, అంగ శేఖర్, సైన ఈశ్వరమ్మలపై స్థానిక సర్పంచ్ అంగ లక్ష్మీ, స్థానిక ఎంపీటీసీ వాడరేవు జగదీష్, వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ వేర్వేరుగా ఫి ర్యాదు చేశారు. తిలక్‌తో పాటు కార్యక్రమంలో జెడ్పీటీసీ పాల వసంతరెడ్డి, కోత సతీష్, మార్పు నాగభూషణరావు, అంగ జనార్ధన్, అంగ మల్లేసు, కొన్న శ్రీరాములు తదితరులు ఉన్నారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన వైఎస్సార్ సీపీ నాయకులు
వణికించే చలిలో నిరీక్షణ
ఘటనపై ఫిర్యాదు చేయడానికి వైఎస్సార్ సీపీ నాయకులు స్టేషన్‌కు వెళ్లగా ఎస్‌ఐ సింహాచలం ఎంత సేపటికీ రాలేదు. దీంతో స్టేషన్‌లో ఉన్న కానిస్టేబుల్‌కు ఫిర్యాదును అందజేశారు. ఫిర్యా దు రశీదు ఇవ్వాలని కోరగా ఇవ్వలేదు. దీంతో వణికించే చలిలో నిరసన వ్యక్తం చేసి బైఠాయించారు. రాత్రి ఎస్‌ఐ వచ్చాక కూడా చాలాసేపు రశీదు ఇవ్వలేదు. అయినా వైఎస్సార్ సీపీ నా యకులు పట్టు వీడకపోవడంతో రాత్రి 11 గంటలకు రశీదు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ శ్రీరా మ్మూర్తి, వైఎస్సార్ సీపీ నాయకులు బి.మోహన్ రెడ్డి, అన్నెపు రామారావు, హేమ సుందర్ రా జు, సంజీవరావు, దుక్క రామకృష్ణ రెడ్డి, చిన్ని జోగారావు, జనార్దన్ రెడ్డి, ఎం.నర్సింగరావు, రాహు ల్, నరేష్, విష్ణు, రమణబాబు, అంగ జనార్థన్, అంగ మల్లేశ్ తదితరులు ఉన్నారు.
టీడీపీ వర్గీయుల దాష్టీకం
టీడీపీ వర్గీయుల దాష్టీకం
టీడీపీ వర్గీయుల దాష్టీకం


