ఎందుకంత కక్ష..?
గిరిజనంపై
● గిరిజనులకు రూ.వేలల్లో విద్యుత్ బిల్లులు వస్తున్న వైనం
● ఏమైందో తెలీక ఆందోళన
చెందుతున్న గిరిజనులు
● ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేసిన బాధితులు
కొత్తూరు: ఉచిత విద్యుత్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసానికి గిరిజనులు బలైపోతున్నారు. కొత్తూరు మండలం ఇరపాడుగూడ, గొట్టిపల్లి గిరిజన పంచాయతీలతో పాటు పలు గిరిజన పంచాయతీలతో అధిక బిల్లులు వస్తున్నా యి. ఉచిత విద్యుత్ అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు గిరిజనులకు రూ.వేలల్లో బిల్లులు వడ్డిస్తోంది. బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు గిరిజనులకు హెచ్చరిస్తున్నారు. దీంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ పథకానికి కొన్ని షరతులు విధించింది. షరతులు దాటిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ వర్తించదు. ఈ నిబంధనల పేరుతో గిరిజనులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. నిబంధనలు వర్తించకపోయినా, 200 యూనిట్లకు తక్కువ వి ద్యుత్ వాడిన వారికి కూడా వేలల్లో బిల్లులు ఇస్తున్నారు. బిల్లులు చూసిన గిరిజనులు నిశ్చేష్టులవుతున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి బిల్లులు రాలేదని వాపోతున్నా రు. సున్నా బిల్లులు రావాల్సిన చోట రూ.వేలల్లో బిల్లులు రావడంతో ట్రాన్స్ కో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సీతంపేట ఐటీడీఏ పీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఉచితం అన్నారు
గిరిజనులకు ఉచిత విద్యుత్ అని ప్రభుత్వం చెప్పింది. బిల్లు మాత్రం ఈ నెలకు రూ.10406 వచ్చింది. తక్కువ కరెంట్ ఖ ర్చు చేసినప్పటికీ వేలల్లో బిల్లు రావడం ఆందోళన కలిగించింది. పోడు పనులు చేసుకొని జీవన గడుపుతున్న నాకు పది వేలు రూపాయిలు బిల్లు ఇవ్వడం అన్యాయం. – కుడ్డంగి కాంతమ్మ,
గొట్టిపల్లి, కొత్తూరు మండలం
లైన్ కట్ చేస్తామంటున్నారు
తక్కువ కరెంట్ ఖర్చు చేసినప్పటకీ రూ. 8915లు బిల్లు వచ్చింది. బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామని అంటున్నారు. ఇలా గిరిజనులను ఇబ్బంది పెట్టడం సరికాదు.
– సవర సింగన్న,
కొత్తగూడ, కొత్తూరు మండలం
నిబంధనల ప్రకారమే బిల్లులు
గిరిజనులకు కేవలం 200 యూనిట్లు వరకు మాత్రమే విద్యుత్ బిల్లులు ఉండవు. 200 యూనిట్లు దాటితే బిల్లు వస్తుంది. గిరిజనుల్లో అవగాహన లేకపోవడం వల్ల 200 యూనిట్లకు మించి ఖర్చు చేస్తున్నారు. అందుకే విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. దీనిపై గిరిజనులకు అవగాహన కల్పిస్తాం. – లక్ష్మణరావు,
ఏఈ ట్రాన్స్‌కో, కొత్తూరు విద్యుత్ సబ్ స్టేషన్
ఎందుకంత కక్ష..?
ఎందుకంత కక్ష..?
ఎందుకంత కక్ష..?
ఎందుకంత కక్ష..?


