అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణస్వామిరిని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, కోర్టు ప్రోటోకాల్ సిబ్బంది పాల్గొన్నారు.
22న అమరవీరుల స్మారకోత్సవం
వజ్రపుకొత్తూరు రూరల్/పలాస: భారత విప్లవోద్యమ నిర్మాణంలో అసువులు బాసిన అమరవీరుల సూర్తితో గరుడబద్ర పంచాయతీ మర్రిపాడులో ఈ నెల 22న సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అమరవీరుల స్మారక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా కమీటి సహాయ కార్యదర్శి వంకల మాధవరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మర్రిపాడులో ఆదివారం కరపత్రాన్ని అవిష్కరించారు. అనంతరం ఆమరవీరుల స్థూపం వద్ద విప్లవ జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో న్యూడెమొక్రసీ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గొరకల బాలకృష్ణ, జుత్తు వీరాస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్ కుమార్, కృష్ణవేణి, పోతనపల్లి కుసుమ, బి.ఈశ్వరమ్మ, సార జగన్, పారాక మాధవరావు, రామారావు, వంకల పాపయ్య తదితరులు పాల్గొన్నారు.
రమేష్ కుటుంబానికి సాయం
అరసవల్లి: అరసవల్లికి చెందిన కళ్లేపల్లి రమేష్ కుమారుడు లీలాసాయికృష్ణ ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బాధితుని తల్లి కళ్లేపల్లి సుజాతకు జిల్లా శిష్టకరణ సంఘం తొలి విడతగా రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేసింది. గత నెల 18న ‘సాక్షి’లో ప్రచురించిన ‘దాతలే దిక్కు’ కథనంపై స్పందించి.. కలెక్టరేట్ సమీపంలో ఓ తోటలో నిర్వహించిన జిల్లా శిష్టకరణ బంధువుల పిక్నిక్‌లో సంఘ గౌరవాధ్యక్షులు బలివాడ మల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డబ్బీరు శ్రీనివాసరావు (వాసు), సదాశివుని కృష్ణలు ఈ మొత్తాన్ని అందజేశారు. శస్త్రచికిత్స మందుల కోసం మరో రూ.20 వేల వరకు సాయం ఇచ్చేందుకు సంఘ ప్రతినిధులు నిర్ణయించారు. కార్యక్రమంలో కోశాధికారి బలివాడ శివప్రసాద్, గౌరవ ప్రతినిధులు ఆర్‌వీఎన్ శర్మ, ఎస్‌వీడీ శర్మ, డబ్బీరు వెంకటరావు, డీవీఆర్ మూర్తి, పి.శ్రీరామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘వందేమాతరం’ స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం కల్చరల్ : జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లి వీధిలో జిల్లా మాజీ సైనికులు వందేమాతర గేయం 150 సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. వందేమాతరం ప్రాముఖ్యతను జిల్లా మాజీ సైనికుల సమాఖ్య అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం సభ్యులకు తెలియజేశారు. అనంతరం సంఘానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ వి.సూర్య నారాయణ, జనరల్ సెక్రటరీ పి.మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.
పేకాట శిబిరంపై దాడి
రణస్థలం: చిల్లపేట రాజాం పరిధిలోని జీడి తోటల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.8090 నగదు, స్కూటీ, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీరిని జె.ఆర్.పురం పోలీసులకు అప్పగించగా ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి


