బాలియాత్రకు బాలారిష్టాలు..! | - | Sakshi
Sakshi News home page

బాలియాత్రకు బాలారిష్టాలు..!

Nov 8 2025 7:36 AM | Updated on Nov 8 2025 7:36 AM

బాలియ

బాలియాత్రకు బాలారిష్టాలు..!

పూర్తిస్థాయి బందోబస్తు

జలుమూరు: ఎంతో ప్రాచీన సాంప్రదాయమైన బాలియాత్ర నిర్వహణకు అడుగులు పడుతున్న తరుణంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. గత మూడు నెలలుగా బాలియాత్రను ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని కోరుతూ నిర్వహణ కమిటీ సభ్యులు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌కు వినతులు ఇచ్చారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలాగే బాలియాత్ర సజావుగా జరిగేందుకు అన్ని అనుమతులు పొందిన తర్వాత ఇప్పుడు నదిలో నీరు ఉందనే కారణంతో దీపోత్సవం నదిలో కాకుండా ప్రత్యామ్నాయంగా చేసుకోవాలని అధికారులు చెప్పడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నదిలో ఐదు అడుగుల నీరు ఉందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి భక్తుల భద్రత దృష్టా దీపాలు వద్దన్నారు. అయితే దీపాలు పెట్టుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేస్తే సమస్య ఉండదని కమిటీ సభ్యులు చెబుతున్నారు. అలాగే కనీసం నది వద్దకు వెళ్లే దారులు కూడా కనీసం అధికారులు వెడల్పు చేసేందుకు చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు.

స్టేజీ వద్దనే పార్కింగా..?

యాత్రలో భాగంగా ఆలయం వెనుక భాగంలో స్టేజీను ఏర్పాటు చేసుకునేందుకు కమిటీ సభ్యులు నాయకులు, అధికారుల వద్ద తాత్కాలికంగా అనుమతి తీసుకున్నారు. దీంట్లో 40 అడుగుల వెడల్పుతో తెర ఏర్పాటు చేసి ప్రాచీన జానపద కళా నృత్యాలు, తప్పెట గుళ్లు తదితర కార్యక్రమాల నిర్వహణకు సిద్ధం చేసుకున్నారు. అయితే ఇంతలోనే అదేచోట వీఐపీలు 20 వరకు కారులు పార్కింగ్‌కు ఆ స్థలమే కావాలని, సాంస్కృతిక కార్యక్రమాలు వద్దని పోలీసులు చెప్పడంతో సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేసినట్లు సమాచారం. మరోవైపు ఈనెల 5వ తేదీన బాలియాత్ర ప్రారంభానికి కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి దంపతులు వచ్చి దీ పోత్సవం నిర్వహించారు. ఇది సహించని కూటమి నాయకులు అధికార పార్టీ నాయకులే ప్రారంభం చేయాలని ఆమెను అవమానించారు. దీంతో పవి త్ర కార్యక్రమానికి కూడా రాజకీయ రంగు పులుముతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

ఈనెల 9వ తేదీన శ్రీముఖలింగంలో జరగనున్న బాలియాత్రలో పూర్తిస్థాయి బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. వంశధార నదిలో ప్రవాహం ఎక్కువ ఉన్నందున దీపోత్సవానికి అవకాశం లేదన్నారు. అయితే భక్తుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని సూచించారు. మూవింగ్‌ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని, నదికి వచ్చి, వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష సూచించారు. ఈ మేరకు శుక్రవారం శ్రీముఖలింగంలో అధికారులు, ఉత్సవ కమిటీతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.

అడుగడుగునా అవాంతరాలు

రాజకీయ రంగు పులిమేందుకు యత్నాలు..?

శ్రీముఖలింగం ప్రధాన దేవాలయం

బాలియాత్రకు బాలారిష్టాలు..! 1
1/1

బాలియాత్రకు బాలారిష్టాలు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement