ప్రైవేటీకరణపై పోరాటం ఉద్ధృతం చేద్దాం
● 12న నియోజకవర్గాల వారీగా ర్యాలీలు ● పోస్టర్ ఆవిష్కరణలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టనున్న ప్రజా పోరాటాన్ని ఉద్ధృతం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు. ఈ నెల 12వ తేదీ బుధవారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించ తలపెట్టిన భారీ నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ నెల 12న నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం అధికారులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యం, విద్య హక్కుపై జరుగుతున్న ఈ దాడిని వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని, ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపించామన్నారు. పోరాట కార్యాచరణ పోస్టర్ ఆ విష్కరణ అనంతరం ధర్మాన కృష్ణదాస్ పార్టీ ము ఖ్య నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహణపై సమీక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కళింగకుల బీ సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబా బు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు చల్ల శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, చిట్టి జనార్ధనరావు, ఎంఏ బేగ్, రౌతు శంకరరావు, బోర చిన్నారావు, కొయ్యా న నాగభూషణరావు, యాళ్ల నారాయణమూర్తి, తేజ, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.


