వెలమ కులాన్ని బీసీ–ఏలోకి మార్చాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): బీసీ–డీలో ఉన్న వెలమ కులస్తులను బీసీ–ఏలోకి మార్చాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి గంగు మన్మధరావు కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర కులస్తులకు రిజర్వేషన్ కల్పించ డం పట్ల తాము వ్యతిరేకం కాదని, తమ కులానికి న్యాయం చేయాలని కోరుతున్నామని చె ప్పారు. విద్య, ఉద్యోగావకాశాలు కూడా తగిన స్థాయిలో రాకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలుర క్రికెట్ పోటీలకు జిల్లాకు చెందిన తుంగాన జ్యోష్మిత్ ఎంపికయ్యాడు. శ్రీకాకుళం కేంద్రంగా ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ క్రికెట్ పోటీల్లో అత్యుత్తమ ఆటతీరుతో రాణించడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 5 నుంచి 9 వరకు హర్యానా రాష్ట్రం రోతక్‌లో జరగనున్న జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. జ్యోష్మిత్ తండ్రి తుంగాన ఆనందరావు ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కాగా, తల్లి సునీత గృహిణి. జ్యోష్మిత్ ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలోని ఆర్‌సీఎం సెయింట్ జాన్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.


