ఉత్సాహంగా ఫెన్సింగ్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాజమండ్రి వేదికగా ఈ నెల 11న జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఫెన్సింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలభద్రుని రాజా పిలుపునిచ్చారు. శ్రీకాకుళం టౌన్ హాల్ వేదికగా శనివారం జిల్లా స్థాయిలో సీనియర్స్ ఫెన్సింగ్ పోటీలు నిర్వహించారు. బహుజన నేత డాక్టర్ కంఠ వేణు, పూర్వపు అధ్యక్షుడు వైశ్యరాజు మోహన్ ఇతర అసోసియేషన్ సభ్యులతో కలసి రాజా ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం కోచ్‌ల పర్యవేక్షణలో బాల, బాలికల ఎంపికలు జరిగాయి. ఎన్.ఐ.ఎస్ కోచ్ జోగిపాటి వంశీ న్యాయ నిర్ణేతగా వ్యవవహరించారు. కార్యక్రమంలో జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు భవానీ, సంపతిరావునాయుడు, పీఈటీ, పీడీలు, కోచ్‌లు రాహుల్, హేమంత్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


