శ్రీకాకుళం
న్యూస్‌రీల్
అక్రమ కేసులకు బెదిరేది లేదు వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
కన్నీటి పర్యంతమైన భార్య శ్రీదేవి
పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ లలితపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బెదిరింపుల కేసు
శ్రీకాకుళం ఏపీసీపై బెదిరింపుల కేసు నమోదు
మాజీ మంత్రిపై సీదిరిపై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం
వరుసగా కేసుల బనాయింపు
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రుల ప్రాణాలు నిలిపిన వేళ సీదిరికి ప్రశంసలు
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా
పాత కేసులు తెరపైకి
గత ఏడాది అక్టోబర్‌లో నమోదైన కేసుపై నేడు విచారణ
ప్రెస్‌మీట్ పెట్టినందుకు, ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినందుకు కేసులు
ప్రశంసలు వచ్చే వేళ..
ఆర్టీసీకి కావాలి ప్రథమ చికిత్స ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు పనిచేయడం లేదు. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. –8లో
టెక్కలి రూరల్: మండలంలోని భీంపురం గ్రా మ సమీపంలో ఉన్న బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం వేకువజామున వసతి గృహం నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న వస తి గృహం సిబ్బంది టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగి న పోలీసు బృందం టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఒంటరిగా ఉన్న విద్యార్థిని గుర్తించారు. వసతి గృహం నుంచి బయటకు రావడానికి గల కారణాలపై ప్రశ్నించారు. అయితే ఆమె నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. వందలాది మంది ఉన్న మహిళ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల భద్ర త ప్రశ్నార్థకంగా మారుతోంది.
వజ్రపుకొత్తూరు: పూండి– గోవిందపురం ఉన్న త పాఠశాల ఆవరణలో రాష్ట్ర స్థాయి 69వ అథ్లెటిక్స్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. స్థాని క పాఠశాల హెచ్‌ఎం, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసి యేషన్ కన్వీనర్ కె.హరిబాబు అద్యక్షతన జరిగి న ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మొదటి రోజు నిర్వహించిన 80 మీటర్ల హర్డిల్స్, 100, 400 మీటర్లు పరుగు పందెం, షాట్‌పుట్, హైజంప్ విభాగా ల్లో అండర్–14 క్రీడాకారులు శ్రీకాకుళం, విజ యనగరం, విశాఖ, ఈస్ట్ , వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి విజయం సాధించారు.
శ్రీకాకుళం క్రైమ్ : పొందూరు కేజీబీవీలో ఇంటర్మీడియెట్ చదువుతున్న దళిత విద్యార్థినిని కులం పేరిట అసభ్యంగా మాట్లాడి ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించేలా చేసిన అక్కడి ప్రిన్సిపల్ సీపాన లలితకుమారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అంతేకాక విద్యార్థినిని బెదిరించినందుకు ప్రిన్సిపాల్‌పైనే కాక జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ) సంపతిరావు శశిభూషణ్‌పై బెదిరింపుల కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు అధికారైన శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద శనివారం రాత్రి వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 19న విద్యార్థిని ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక వసతి గృహం భవనంపై నుంచి దూకేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రిన్సిపాల్, ఏపీసీలు బెదిరించడంతో తాను ప్రమాదవశాత్తు పడిపోయానని చెప్పాల్సి వచ్చిందని బాలిక ఇటీవల మీడియా ముందుకు వచ్చి చెప్పింది. దాదాపు 2 నెలలుగా 2 కాళ్లకు 6 ఆపరేషన్లతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికకు వారినుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో మీడియా ముఖంగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
ప్రెస్‌మీట్ పెడితే కేసు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే కేసు, ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తే కేసు.. బీసీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రజా వ్యతిరేక పాలనను గట్టిగా ఎండగట్టడమే కాకుండా సమస్యలపై నిలదీస్తున్నందుకు కేసులతో బెదిరించాలని చూస్తోంది. దానిలో భాగంగా గతంలో వచ్చిన ఫిర్యాదులపై నమోదు చేసిన కేసును తిరగ దోడి, తాజాగా మరో కేసు జోడించి ఇబ్బంది పెట్టా లని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పెద్దలపై గట్టిగా మాట్లాడుతున్నారని, పోలీసు అధికారుల వైఖరిని దుయ్యబడుతున్నారని మత్స్యకార సామాజికి వర్గానికి చెందిన అప్పలరాజుపై ఫిర్యాదులు చేయించి, కేసులపై కేసులు మోపాలని ప్లాన్ చేస్తోంది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా నిలదీస్తు న్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై రోడ్డెక్కి గళమెత్తుతున్నారు. క్యాడర్‌తో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తుంటే నేనున్నానంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్లి నిలదీస్తున్నారు. చంద్ర బాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌తో పాటు జిల్లా పోలీ సు అధికారుల తీరుపై మండిపడటాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. పాలనా వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేలా చేస్తున్న సీదిరి అ ప్పలరాజును ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఇటీవల లోకేష్ జిల్లాకొచ్చిన ఇచ్చిన ఆదేశాలతో ఆ యత్నాలకు మరింత పదును పెట్టింది. దానిలో భాగంగా పాత కేసులు తిరగదోడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో రెండు రోజుల కిందట కాశీబుగ్గ వ్యాపారి కిడ్నాప్‌కు సంబంధించిన విషయమై పోస్టు పెట్టారని శిష్టు గోపి అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తను కవిటిలో రాజకీయంగా ఇచ్చిన ఫిర్యాదుపై అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడికి వెళ్దామని బయలుదేరే లోపు 2024 అక్టోబర్ 27న నమోదైన కేసును తెరపైకి తెచ్చి, హుటాహుటీన 41నోటీసు ఇచ్చారు. ఆ కేసు నమో దైన రోజున సీదిరి మాట్లాడుతూ ‘మైనర్ బాలికపై దాడి చేసిన వ్యక్తులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేస్తే తప్ప ఇలాంటి ఘటనలు జరగవు. సక్రమంగా చర్యలు తీసుకోకపోవ డం వలన పునరావృతం అవుతున్నాయి. స్టేషన్ లోపల దాడి చేసిన వ్యక్తులపై సాయంత్రం లోగా హత్యాయత్నం కేసు పెట్టాలి. కేసులు పెట్టకపోతే ఇక్కడొక పోలీసు స్టేషన్ ఉందని భావించలేము’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ విషయమై పలాస మండలం కిష్టుపురం గ్రామానికి చెందిన బూర్లె విజయ కృష్ణంరాజు వ్యూహాత్మకంగా ఫిర్యాదు చేయడం, దాని ఆధారంగా అప్పలరాజుపై 352, 353(డీ(బీ), 351(2), 353(2)బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద నమోదు చేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడా కేసును తెరపైకి తెచ్చి శనివారం సీదిరి అప్పలరాజు ఇంటికి పోలీసులు వచ్చి 41 కింద నోటీసు ఇచ్చారు. వెంటనే పోలీసు స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరు కావాలని కోరారు. ఆయన వచ్చేంతవరకు పోలీసులు అక్కడే ఉన్నారు. దీంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి విచారణలో పాల్గొన్నారు. శనివారం పొద్దు పోయే వరకు విచారణ జరుగుతూనే ఉంది. రాత్రి 9.30 గంటల సమయంలో సీదిరి అప్పలరాజు, శిష్టు గోపి ఇద్దరినీ ఆయా పోలీస్ స్టేషన్ల నుంచి విడిచిపెట్టారు.
వజ్రపుకొత్తూరు రూరల్: మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు శనివారం ఉదయం మధ్యా హ్నం విచారణ పేరుతో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాత్రి 8 గంటలు అవుతున్నా ఇంటికి చేరుకోకపోవడంతో అప్పలరాజు సతీమణి సీదిరి శ్రీదేవి కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. స్టేషన్‌లో ఒక సాధారణ వ్యక్తిని విచారించిన మాదిరిగా రాష్ట్రానికి ఒక మంత్రిగా పనిచేసిన విద్యావంతుడైన వైద్యుడిని స్టేషన్ రిసెప్షన్ వద్ద విచారణ చేస్తుండడాన్ని చూసిన ఆమె కన్నీటి పర్యంతమైంది. బిక్కుబిక్కుమంటూ ఏడ్చుకొని తన వద్దకు వచ్చిన ఆమెను డాక్టర్ సీదిరి అప్పలరాజు ఓదార్చి ధైర్యం చెప్పి, అక్కడి నుంచి పంపించారు.
కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన సమయంలో అక్కడకు ముందుగా వెళ్లి, క్షతగాత్రులకు అండగా నిలిచింది సీదిరి అప్పలరాజు మాత్రమే. స్వతహాగా వైద్యుడు కావడంతో సీపీఆర్ తదితర తక్షణ వైద్య సేవలు అందించి కొందరి ప్రాణాలు కాపాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తన సేవలందించారు. దీంతో శభాష్ డాక్టర్ అప్పలరాజు అని ప్రజల నుంచి ప్రశంసలు అందాయి. మీడియాలో వచ్చిన కథనాలతో ప్రపంచ నలుమూలల నుంచి మాధ్యమాల ద్వారా అప్పలరాజు కు ప్రశంసలు వచ్చాయి. దీంతో ఆయన ప్రతిష్ట మరింత పెరిగింది. ఇప్పుడీ సమయంలో ఏదొ క కేసును బయటకి తీసుకొచ్చి హడావుడి చేస్తే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా తనకొస్తున్న పేరును తగ్గించొచ్చని ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దానిలో భాగంగా పాత కేసులను తిరగదోడి ఇబ్బందులు పెట్టాలని కార్యాచరణ అమలు చేస్తోంది.
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం
శ్రీకాకుళం


