విజేతలై తిరిగి రావాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి పోటీల్లో సమష్టిగా రాణించి విజేతలై జిల్లాకు తిరిగిరావాలని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్‌ఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు సాఫ్ట్‌బాల్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వేదికగా ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్–2025 పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల బృందం శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రీడా సామగ్రి, దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు, మెట్ట తిరుపతిరావు, ఎం.ఆనంద్‌కిరణ్, ఎ.ఢిల్లీశ్వరరావు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, కె.మాధవరావు, జి.శ్రీనివాసరావు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.


