అన్నదమ్ములు ఆదర్శనీయులు
రణస్థలం: లావేరు మండలంలోని కొత్త కుంకాం పంచాయతీలో మచ్చ రామారావు, గోవిందరావు, శంకర్ ముగ్గురు అన్నదమ్ములు కొత్త కుంకాం పాఠశాలకు కిచెన్ గార్డెన్ కోసం 58 సెంట్ల భూమి సాగు నిమిత్తం ఇవ్వడం ఆదర్శనీయమని లావేరు ఎంఈవో మజ్జి మురళీ కృష్ణ అన్నారు. పిల్లల మధ్యాహ్న భోజనానికి ఆకుకూరలు, కాయగూరలు సేంద్రియ పద్ధతుల ద్వారా పండించి స్కూల్‌కి అందిస్తున్నారు. ముగ్గురు అన్నదమ్ములు తమ పొలాన్ని సాగుకు ఇవ్వడమే కాకుండా సహకరిస్తున్నందుకు ఉపాధ్యాయులు సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు పొట్నూరు శ్రీనివాస్, తమ్మినేని నీలంనాయుడు తదితరులు పాల్గొన్నారు.


