ఘనంగా న్యాయసేవా దినోత్సవం
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి పి.భాస్కరరావు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు తక్షణ న్యాయం, న్యాయసేవలు అందించడమే జాతీయ లోక్ అదాలత్ ముఖ్య లక్ష్యమన్నారు. ప్రజలకు అవగాహన లేకపోవడం చాలామందికి న్యాయం జరగడం లేదన్నారు. కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు 3వ అదనపు జిల్లా జడ్జి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, స్పెషల్ (పోక్సో) న్యాయమూర్తి ఎన్.సునీత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, అడిషనల్ సివిల్ జడ్జి ఆర్.శాంతిశ్రీ, ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కె.అనురాగ్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.శివప్రసాద్, కార్యదర్శి పిట్టా దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: ఏపీ పీటీడీ శ్రీకాకుళం జిల్లా జై భీమ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో ఎస్సీ, ఎస్టీ కమిటీ హాల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జేవీ రావు, కార్యదర్శిగా ఏఎస్ చలం, వైస్ ప్రెసిడెంట్‌గా కె.అచ్చయ్య, జాయింట్ సెక్రటరీగా కె.సోములు, అసిస్టెంట్ సెక్రెటరీగా జె.ఉషారాణి, కోశాధికారిగా బీఎల్ నారాయణ, పబ్లిసిటీ సెక్రటరీగా పి.శ్రీను, కార్యవర్గ సభ్యులుగా కేఎం కుమార్, దాలయ్య, పీయూఎం రావు, కేఆర్ రావు, జి.శారద, ఆర్‌కే రావు, జీఆర్ రావు తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ కేఆర్‌ఎస్ శర్మను అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో టెక్కలి డిపో సెక్రటరీ జీఎన్ భూషణ్, సీహెచ్ వెంకటరమణ, పీవీ ఆనంద్, జీఎస్ చలం, డి.శివాజీ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా న్యాయసేవా దినోత్సవం


