23న జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు
శ్రీకాకుళం: మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతంగా నిర్వహించామని, ఈ నెల 23న జిల్లా స్థాయి పోటీలుంటాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు తెలిపారు. మంగళవారం మండల స్థాయిలో జరిగిన పలు కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ జిల్లాలో 30 మండలాలు, 355 ప్రభుత్వ పాఠశాలలు, 45 ప్రైవేటు పాఠశాలల నుంచి 476 జట్లతో 1428 మంది విద్యార్ధులు, 600 మంది ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం వహించారని వివరించారు. మండల స్థాయి విజేతలు 23న శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.


