సరికొత్త వరివడి
సేద్యంలో..
● కొత్త రకాలను సాగు చేస్తున్న ఉద్దానం బీల రైతులు ● విరగకాసిన పైర్లతో కళకళ
కవిటి :
రాష్ట్రంలో రెండో కోనసీమగా గుర్తింపు పొందిన కవిటి ఉద్దానం ప్రాంతంలో కొత్త రకం వరి వంగడాల సాగుతో పలువురు రైతులు ఔరా అనిపించుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణా వరి పరిశోధనా స్థానంలో తయారైన వరి రకాలు, ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో విజయవంతంగా సాగు చేసిన వరి విత్తనాలను ఈ ఏడాది తెప్పించి ఖరీఫ్ సీజన్‌లో విజయవంతమయ్యారు. ఈ రకాలన్నీ 125 రోజులు, 135 రోజులు, 140–145 రోజుల మధ్యస్త పంట కాలవ్యవధి కలిగినవే. ఇక్కడి రైతులు వీటిని యూట్యూబ్‌లో చూసి గతంలో సాగుచేసిన రైతుల అనుభవాలతో కూడిన కథనాలు చదివి వారిని ఉద్దానం బీలప్రాంతంలోనూ సాగు చేయడమే కాకుండా విజయవంతం కావడం విశేషం. ఈ ప్రాంతంలో తొలిసారి సాగుచేసిన ఈ వరిపైర్లను చూసేందుకు ఇరుగు పొరుగు రైతులు కూడా వస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికందినప్పటికీ అడవిపందులు, పక్షుల బెడద తీవ్రంగా ఉందని రైతులు చెబుతున్నారు.
సరికొత్త వరివడి


