పోలీసుల అదుపులో ‘మోస్ట్‌వాంటెడ్ దున్న కృష్ణ’
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకు చెందిన కరడు గట్టిన దొంగ, పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ‘దున్న కృష్ణ’ శ్రీకాకుళం సీసీఎస్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతన్ని పట్టుకోవడానికి రాష్ట్రంలో అన్ని పీఎస్‌ల పోలీసులూ ప్రయత్నిస్తున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి దున్న కృష్ణను పట్టుకునే బాధ్యతను సీఐ సూర్యచంద్రమౌళి ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులకు అప్పగించారు.
ఆరు నెలలు శ్రమించి..
ఆరు నెలల నుంచి దున్న కృష్ణను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సీసీఎస్ పోలీసులు ఈ ఏడాది విజయదశమికి ముందే కలకత్తాలో దాదాపు పట్టుకునేంత పనిచేశా రు. విపరీతమైన తుఫాన్లు రావడంతో అక్క డి కమ్యూనికేషన్ దెబ్బతిని త్రుటిలో కృష్ణ తప్పించుకున్నాడు. జిల్లా పోలీసులే పట్టుకుంటారన్న ఆశ ఉన్నప్పటికీ ఎక్కడ మిస్ అవుతాడేమో అని ఇటీవల జిల్లా పోలీ స్ కార్యాలయం నుంచి మోస్ట్ వాంటె డ్ క్రిమినల్ పోస్టర్ విడుదల చేశారు.
ఐదు బృందాలతో గాలింపు చర్యలు..
సీసీఎస్ పోలీసులు, ఆమదాలవలస జీఆర్‌పీఎస్ ఎస్‌ఐతో అక్కడ పట్టుకునేందుకు ఒక టీమ్, శ్రీకాకుళం వన్‌టౌన్, టూటౌన్ పోలీసులతో రాత్రి నిఘా పెడు తూ మొత్తం ఐదు బృందాలు గాలింపు చేపట్టాయి. కోల్‌కతాలో కుటుంబం, బంధువు లు ఉండటంతో అక్కడ ఎస్‌ఐ రాజేష్ ఆధ్వర్యంలో సీసీఎస్ టీమ్, విజయనగరం బొబ్బిలిలో కదలికలుండటంతో అక్కడో సీసీ ఎస్ టీమ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సాయంతో వెళ్లారు. చివరికి కోల్‌కతాకు వెళ్లిన సీసీఎస్ టీమ్‌కు కృష్ణ పట్టుబడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
రికవరీ చేసే పనిలో..
పోలీసులు ఇతని నుంచి బంగారాన్ని రి కవరీ చేయించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. మన జిల్లాలో ఇటీవల 15 నేరాలు చేసినట్లు, విశాఖలో మరో 10కు పైగా నేరాలు చేసినట్లు తెలుస్తోంది.


