ఒంటూరులో ట్యాంకర్‌తో నీటి సరఫరా
కవిటి: ‘చుక్కనీరైనా దొరకదు కదా ఇది ఒంటూరు కథ’ అనే శీర్షికతో ‘సాక్షి’ పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనంపై గ్రామ పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. స్థానిక సర్పంచ్ లలితాసాహు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దేవరాజ్ సాహూ ఒంటూరు వెళ్లి ప్రజలకు తాగునీటి అవసరాల నిమిత్తం ట్రాక్టర్‌తో ఒక ట్యాంక్ నీటిని పంపిణీ చేశారు. గడచిన వారంరోజులుగా పంచాయతీ నుంచి పంపిణీ చేస్తున్నామని దేవరాజ్ సాహు తెలిపారు. ఇది ఒంటూరుకు సరైన పరిష్కారం కాదని ముందు ఊరికి మంచి వాటర్‌ట్యాంక్, కుళాయి పైప్‌లైన్, నీటిసరఫరా వంటి చర్యలతో మాత్రమే శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
ఒంటూరులో ట్యాంకర్‌తో నీటి సరఫరా


