అవిసిన గుండెలు.. అలసిన బతుకులు
గుండెలోని కష్టం చెప్పుకుంటే ఎప్పటికి పరిష్కారమవుతుందో తెలీదు. గొంతు తెరిచి ఫిర్యాదు చేస్తే ఎవరు వేధింపులకు పాల్పడతారో అర్థం కాదు. కంటితో చూసిన అక్రమాన్ని ప్రశ్నిస్తే నాయకుడి కోపం నుంచి తప్పించుకునే వీలే లేదు. సగటు సిక్కోలు మనిషి రానురాను నిస్సహాయుడైపోతున్నాడు. చనిపోవడానికి సిద్ధమని ప్రకటించుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదేమో అన్నంతగా బలహీనుడిగా మారుతున్నాడు. గ్రీవెన్స్‌లో కనిపిస్తున్న పెట్రోల్ బాటిళ్లు ఈ అలసిన బతుకులకు సాక్ష్యాలు. బాధితుల చేతుల్లోని పురుగు మందుల డబ్బాలు అవిసిన గుండెలకు నిదర్శనాలు.


