నిఖిల్ కుటుంబానికి జెడ్పీ చైర్‌పర్సన్ పరామర్శ
సోంపేట: కాశీబుగ్గ చిన్నతిరుపతి దేవస్థానం వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన నిఖిల్ కుటుంబాన్ని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్‌తో కలిసి మంగళవారం బెంకిలిలో పరామర్శించారు. బాధలో ఉన్న తల్లిదండ్రులకు ఓదార్చారు. అనంతరం సోంపేట పట్టణంలో ఇటీవల మృతి చెందిన దున్న దర్మారావు, మ ల్లపు రెడ్డి గోవిందరాజులు, కొర్లాం పంచాయతీలో మృతి చెందిన బతకల వల్లభరావు కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలియజేశారు. జింకిభద్ర సర్పంచ్ తామాడ పద్మావతి, పార్టీనాయకులు కోట రాజు, బతకల శంకరరావు, పెద్దకోట అనంత్, రౌ తు విశ్వనాదం,ఇండుగు లక్ష్మినారాయణ,తామాడ మోహనరావు,తులసయ్య పాల్గొన్నారు.
ఆస్పత్రిలో క్షతగాత్రులకు..
పలాస: కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో తీవ్రగాయాల పాలై పలాస కమ్యూనిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా న్యా య సేవా సంస్థ కార్యదర్శి కె.హరిబాబు మంగళవారం పరామర్శించారు. గాయపడిన వారితో మా ట్లాడారు. వైద్యులు పాపినాయుడుతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు కాశీబుగ్గ ఎస్.ఐ నరిసింహమూర్తి, పోలీసు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
నిఖిల్ కుటుంబానికి జెడ్పీ చైర్‌పర్సన్ పరామర్శ


