
ఎల్.ఎన్.పేట.. జాప్యం ఎందుకట?
హిరమండలం: లక్ష్మీనర్సుపేట.. అందరూ ఎల్.ఎన్.పేటగా పిలిచే ఈ మండలానికి ఓ సమస్య నిత్యం వెంటాడుతుంటుంది. మండల కేంద్రానికి అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ శాంతిభద్రతల పర్యవేక్షణలో కీలకమైన పోలీస్‌స్టేషన్ మాత్రం ఏర్పాటు కావడం లేదు. ప్రస్తుతం ఎల్‌ఎన్‌పేట మండలానికి సంబంధించి శాంతిభద్రతల పర్యవేక్షణ అంశం సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. దీంతో చిన్న చిన్న కేసులు, రోడ్డు ప్రమాదాలు వంటి విషయంలో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్ సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ఎల్‌ఎన్‌పేటలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేస్తామని దశాబ్దాలుగా చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. జిల్లాలో పోలీస్‌స్టేషన్ లేని మండలంగా ఎల్‌ఎన్‌పేట మిగిలిపోతోంది.
రెండున్నర దశాబ్దాలుగా..
జిల్లాలో భౌగోళికంగా ఉన్న అతి పెద్ద మండలం సరుబుజ్జిలి. దీంతో పాలనాపరమైన సౌలభ్యం కోసం 1999లో సరుబుజ్జిలి నుంచి ఎల్‌ఎన్‌పేట మండలాన్ని 19 పంచాయతీలతో ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఎల్‌ఎన్‌పేట మండల కేంద్రంగా కొనసాగుతూ వచ్చింది. అప్పట్లోనే శాఖలపరంగా అన్ని కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భావించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కేజీబీవీ, ప్రత్యేక విద్యుత్ సబ్‌స్టేషన్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వంటివి ఏర్పాటు చేశారు. కానీ పోలీస్‌స్టేషన్ మాత్రం కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతానికి మండల పరిధి పెరిగింది. ముఖ్యంగా వంశధార ని ర్వాసిత గ్రామాలు పెరిగాయి. చిన్నకొల్లివలస, గా ర్లపాడు, పాడలి, తులగాం నిర్వాసిత గ్రామాల వా రు ఎల్‌ఎన్‌పేట మండలంలో వేర్వేరు పంచాయతీల్లో నివాసం ఏర్పాటుచేసుకున్నారు. మరోవైపు మోదుగువలస ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, శ్యామలాపు రం ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, తాయిమాంబాపురం ఆర్ అండ్‌ఆర్ కాలనీ పేరుతో మూడు పంచాయతీలు సైతం ఎల్‌ఎన్‌పేట మండలంలో చేరాయి. ప్రస్తుతం మండల భౌగోళిక పరిధి 72 కిలోమీటర్లుగా ఉంది.
జనాభా పెరిగినా..
ప్రస్తుతం మండలంలో జనాభా 40 వేల వరకూ ఉంటుందని అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం 27 వేల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం మండలం పరిధి పెరిగింది. జనాభా కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి 30 వేల మంది జనాభాకు పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేయాలన్న నిబంధన ఉంది. ఈ లెక్కన ఇక్కడ కచ్చితంగా స్టేషన్ ఏర్పాటుచేయాలి. అయినా పోలీస్ శాఖ పట్టించుకోవడం లేదు. ఈ మండలం మీదుగా అలికాం–బత్తిలి రహదారి ఉంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు సైతం ఉన్నాయి. ఏటా శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థ స్నా నం జరుగుతుంటుంది. ఆ సమయంలో పక్క మండలాల నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి విధులు నిర్వహిస్తుంటారు. జిల్లాకు డీజీపీ, డీఐజీ స్థాయి అధికారులు వచ్చిన సమయంలో ఎల్‌ఎన్‌పేటలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటుపై మాట్లాడుతుంటారు. తర్వాత మరిచిపోతుంటారు. ఇప్పటికై నా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
పోలీస్‌స్టేషన్ లేని
ఏకై క మండలంగా
లక్ష్మీనర్సుపేట
దశాబ్దాల హామీ కార్యరూపం దాల్చని వైనం
కేసులు, ఫిర్యాదులకు పక్క
మండలానికి వెళ్లాల్సిందే
అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు
హిరమండలం: ఎల్.ఎన్.పేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలోని సీ్త్ర శక్తి భవనంలో అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఆమదాలవలస సీఐ పి.సత్యనారాయణ తెలిపారు. అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ విలేకరులతో మాట్లాడుతూ ఎల్.ఎన్.పేట మండలంలో పోలీస్ స్టేషన్ లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్క డ అవుట్ పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవుట్ పోస్టు సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పని చేస్తుందన్నారు.
స్టేషన్ ఏర్పాటుచేయాలి
ఎప్పుడో 1999లో మండలాన్ని ఏర్పా టుచేశారు. అయినా ఇంతవరకు పోలీస్‌స్టేషన్ లేకపోవడంతో కేసులు, ఫిర్యాదులు వంటి వాటి కోసం సరుబుజ్జిలి వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి పోలీస్‌స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలి. – పెనుమజ్జి విష్ణుమూర్తి,
యంబరాం, ఎల్‌ఎన్‌పేట మండలం

ఎల్.ఎన్.పేట.. జాప్యం ఎందుకట?