
అర్హులందరికీ పింఛన్లు
శ్రీకాకుళం రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పెన్షన్ విధానం అమలు చేస్తోందని ఎస్‌ఎంఈ, ఎన్నారై, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పాత్రునివలసలో శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదిన పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నెలకు సుమారు రూ. 2,700 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన సూపర్‌సిక్స్ హామీలన్నీంటినీ నెరవేర్చామని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం అన్నదాత సుఖీభవ పథకం, 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.