
రేపు జిల్లాస్థాయి యోగా పోటీలు
నరసన్నపేట: నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 3న జిల్లా యోగాసనా చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివేకానంద ధ్యాన యోగా సమితి అధ్యక్షుడు కింజరాపు రామారావు తెలిపారు. యోగాసన స్పోర్ట్ అసోషియేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా అభ్యాసకులకు ఇచ్చే టీషర్టులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ , ఎన్‌వైఎస్‌ఎఫ్ కార్యదర్శి బోత్స కేదారినాథ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 7 కల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు.
బాక్సర్‌కు అభినందనలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన యువ బాక్సింగ్ సంచలనం జి.సత్యభార్గవ్‌ను డీఎస్‌డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు అభినందించారు. శుక్రవారం కోడిరామ్మూర్తి స్టేడియం వద్ద శిక్షణకు హాజరైన సత్యభార్గవ్‌ను, తీర్చిదిద్దుతున్న కోచ్ పి.ఉమామహేశ్వరరావును మెచ్చుకున్నారు. హర్యానాలోని రోతక్ వేదికగా జరిగిన ఆలిండియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఈ యువ బాక్సర్ రజత పతకంతో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్ కోచింగ్ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. త్వరలో శిక్షణా శిబిరాలకు హాజరుకానున్నట్టు కోచ్ తెలిపారు.
రెడ్డీస్‌లో బ్యాటరీలు చోరీ
రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటీస్ సీటీవో–6 పరిశ్రమలో గత నెల 23న నాలుగు పెద్ద బ్యాటరీలు చోరీ జరిగినట్లు జె.ఆర్.పురం పోలీసులు తెలిపారు. పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.చిరంజీవి శుక్రవారం చెప్పారు.

రేపు జిల్లాస్థాయి యోగా పోటీలు