
క్యాంపస్ డ్రైవ్‌లో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల : శ్రీకాకుళంలోని రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో ఏడుగురు సీఎస్‌ఈ విద్యార్థులు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని గ్రిడ్లైక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగాలు దక్కించుకున్నారు. నెలకు రూ. 20 వేలు స్టైపండ్‌తో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాక సంవత్సరానికి రూ.8,00,00 ప్యాకేజీ అందిస్తారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ, అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్స్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, సీఎస్‌ఈ విభాగాధిపతి వై.రమేష్, అధ్యాపకులు అభినందిస్తూ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందించారు.