
దళితుల భూములకు రక్షణ కల్పించాలి
ఎచ్చెర్ల : బుడతవలస దళితల భూములకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనారి మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం లావేరు మండలం బుడతవలస గ్రామాన్ని సందర్శించి వివాదాస్పద భూమిని వీరు పరిశీలించారు. 2006లో అప్పటి ప్రభుత్వం దళితులైన పిన్నింటి లక్ష్మీ, రమణమ్మ, కుప్పిలి అనసూయ, సింహాచలంలకు సర్వే నంబర్లు 344/4, 344/8, 344/9, 344/10 లో 6.43 ఎకరాల డీ పట్టాలను మంజూరు చేసిందని తెలిపారు. ఈ భూముల్లో నీలగిరి మొక్కలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఇటీవల నడుపూరి రాంబాబు, మహాంతి రాజులు, రూప వచ్చి నీలగిరి తోటలు నరుక్కుపోయారని, ఈ విషయమై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భూములను దళితులకు అప్పగించాలని డిమాండ్‌చేశారు.