
వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ హామీ ఏమైంది?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని ప్రాజెక్టుల నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేర కు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కొత్తూరు మండల కేంద్రంలో నిర్వాసితుల ఉద్దేశించి మాట్లాడారని, టీడీపీ అధికారంలోకి వస్తే నిర్వాసితులందరికీ స్పెషల్ ప్యాకేజీ ఇప్పిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. గతంలో మీ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ గంపెడు ఆశలతో మీ ప్రభుత్వాన్ని గెలిపించారని అధికారంలోకి వచ్చి సంవత్సర కా లం కావస్తున్నా నిర్వాసితులకు ఇచ్చిన హామీ ఏమైందో తెలియడం లేదన్నారు. సీఎం శ్రీకా కుళం వస్తున్న సందర్భంగా నిర్వాసితులకు ఇచ్చిన హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని బుడగుట్లపాలెంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. బుడగుట్లపాలెం తీరంలో ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పర్యవేక్షించారు. అధికారుల వెల్లడించిన షెడ్యూల్ మేరకు చంద్రబాబు 12.10 గంటలకు గ్రామ దేవత అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మత్స్యకారులతో ము ఖాముఖి, మత్స్యకార చేయూత పథకం ప్రా రంభం, పార్టీ నాయకులతో సమావేశం నిర్వ హిస్తారు.
నిలిచిపోయిన
డయాలసిస్ సేవలు
కాశీబుగ్గ: పలాస కిడ్నీ ఆస్పత్రిలో నెఫ్రో ప్లస్ వారు నిర్వహిస్తున్న డయాలసిస్ సేవలు శుక్రవారం నిలిచిపోయాయి. మూడు షిఫ్ట్‌లలో జరుగుతున్న డయాలసిస్ సేవలు 10:30 గంటల నుంచి 02 గంటల వరకు సేవలు పునరుద్ధరణ కాలేదు. టెక్నికల్ సమస్య తలెత్తడంతో ఇంజనీరింగ్ అధికారులు వచ్చి మరమ్మతులు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికే పలు మార్లు విద్యుత్, జనరేటర్ సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా తాజాగా మిషనరీలు టెక్నికల్ సమస్య తోడుకావడంతో డయాలసిస్‌కి హాజరైన కిడ్నీ రోగులు పాట్లు పడ్డారు. వారికి సహాయకులుగా వచ్చిన వారంతా రోజంతా నిరీక్షించారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మ జను వివరణ కోరగా డయాలసిస్ ఈ విషయం తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని వారిని పిలిపించి మాట్లాడుతానని అన్నారు.
‘ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాకు ప్రత్యేకంగా ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమలుచేయలేదని, ఇప్పుడైనా అమలు చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్య దర్శి వర్గ సభ్యులు కె.మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని, జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటామన్న హామీలు నేటికీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. జిల్లాలో ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపట్టాలని, కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలన్నారు. గొట్టా బ్యారేజ్ నిర్మాణం చేసి 50 ఏళ్లు పూర్తి కావస్తోందని ఆధునికీకరణకు రూ. 1600 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2007లో ప్రారంభించిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలన్నారు.

వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ హామీ ఏమైంది?